Search This Blog

Saturday 10 November 2012

మాటల ది"గ్గజం"




మొన్నటికి మొన్న ఒకటే పెయింటింగ్స్ వేసేసింది. నిన్న మరొకటి కార్లు కడెగె బిజినెస్ పెట్టేసింది. ఎ రోజు ఏకంగా హాయ్ హలో అంటూ పలకరించేస్తోంది మరొకటి.. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారు ఏనుగుల గురించి..

ఇన్ని రోజులు మనుషులు ఒక్కటే మాట్లాడతారు అనుకున్నే వాళ్ళం.. అక్కడక్కడ  చిలకలు మాట్లాడుతుంటే చిలక పలుకుల్లె అనుకున్నాం. తరవాత ఓ ఎలుక ముద్దుగా తన ప్రియురాలిని మురిపించేదుకు పాట పాడితే అది గొప్ప సింగర్ ఐపోతుందని చెప్పం.. ఇప్పుడు ఓ ఏనుగు నేనేమైన తక్కువ అని హాయ్ హలో కూర్చో అని మనకే చెబుతోంది.. మావటి చెప్పిన మాటల్ని వల్లెవేస్తోంది.  
ఇది వరకే కొరియాలోని ఓ ఏనుగు గొప్ప పేరు తెచ్చుకుని వార్తలకేక్కింది. మరొకటి తొండంతో నిల్లు చిమ్ముతూ కార్లు కడిగే జాబు చేస్తోంది. ఇలా చెప్పుకుంటూ పొతే ఏనుగులు చేసే వింతలూ చాలానే ఉన్నాయ్. ఇప్పుడు 22 ఏళ్ళ ఆడ ఏనుగు కోసిక్వంతు వచ్చింది. ఐదేళ్ళ వయసున్నపుడు సౌత్ కొరియా జుకి చేరింది. అప్పటి నుండి అక్కడే ఉంటోంది. 2004 నుండి అంటే కోసిక్కి 14 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుండి మాట్లాడటం మొదలు పెట్టింది. కానీ మొద మావటి దాని మాటల్ని పట్టించుకోలేదు. క్రమంగా మనుసుల్లనే ఏంటో చక్కగా మాటలాడటం చూసి అదికారులకి చెప్పాడు. ఇంకేముంది కాలిఫోర్నియా పరిసోదకుడు ఏంజెలా స్తోగేర్ సౌత్ కొరియా చేరుకొని కోసిక్ని పరిసిలించాడు. అది మాట్లాడిన మాటల్ని రికార్డు చేసాడు అది మాట్లాడిన ఐదు మాటలు అనయోంగ్, అంజా, అనియ,  నువో, చావ వీటి అర్థాలు వరుసగా హలో, కూర్చో, వద్దు పడుకో, మంచిది అని.
అసలు ఎనుగుకు పై పెదవి ఉండదు. కింది పెదవి మాత్రమే ఉంటుంది. అందులోని మాట్లాడేందుకు కావలసిన అవయవ నిర్మాణం కూడా  సరిగా ఉండదు.అలాంటిది ఎలా మాట్లాడగాలుగుతుంది అన్నది పెద్ద విచిత్రంగా ఉంది. అందుకే దీనిపై పరిశోదనలు చేస్తున్నారు వారి పరిశోదనాల్లో దీనికి సంబందించిన విషయాలు బైట పడితే ఇంకేముంది ఎంచక్కా మన కుక్క పిల్లి అన్నిటికి మాటలు నేర్పించుకోవచ్చు.


ఓపెన్ కేబుల్ కారులో.. షికారుకి..


పిట్టలలాగా స్వేచ్చగా గాలిలో ఎగరాలి కానీ ఎటువంటి అడ్డు ఉండదు ఎలా? ఏముంది టాప్ లెస్ ఓపెన్ కేబుల్ కార్ లో వేలితే సరి..!
స్విడ్జర్లాండ్లోని లుసేర్స్ నగరంలో ప్రపంచంలో మొదటి సరి ఓ సరికొత్త కేబుల్ కారని ఏర్పాటు చేసారు దాని పేరు కాబ్రియో. ఈ కేబుల్ కారని ఒకేఅరి 60 మంది ప్రయాణికుల్ని స్తనేర్స్ హార్న్ పర్వతం మీదకు తిసుకేల్త్న్ది అది కూడా 1850 కిలో మీటర్ల ఎత్తులో ఉన్న పర్వతం.
ఐతే ఎంతట ఎలాంటివి చాలానే ఉన్నాయ్ అనుకుంటున్నారా..? ఆగండి అప్పుడే ఓ నిర్యానికి వచేస్తే ఎలా.. ఏది మాములుగా అన్ని కేబుల్  కార్లల అన్ని వేపుల మూసేసి ఉండదు మరి ఏది ఓపెన్ దేబుల్ డెక్కర్ కార్. అంటే పైన టాప్ మొత్తం ఓపెన్ చేసి ఉంటుంది. కింద మాత్రం అద్దాలతో మూసి ఉంటుంది. అంటే పైన కుర్చుని ఎంచక్కా గాలిలో తేలుతున్నట్లు వేల్లిపోవచ్చానమాట.
ఇంకా దిని గురించి...
కాబ్రియోనే మొదటి డబల్ డెక్కర్ కార్ ఏమి కాదు.. ఏది వరకే జపాన్, ఫ్రాన్స్ దేశాల్లో ఎటువంటివి ఉన్నాయ్. కానీ ఎలా ఓపెన్ టాప్ మాత్రం లేదు. అవన్నీ అద్దాలతో మూసేసి ఉంటై. ఎక్కడికి వెళ్ళాలంటే ముందుగ స్విడ్జర్లాండ్లోని స్టన్ అనే గ్రామం నుండి ప్రయాణం మొదలు పెట్టాలి. అక్కడి నుండి లుసేర్స్ నగరం చేరుకున్నాక ఇంకేముంది కాబ్రియోకి వేల్లిపోవాచు.
అంతే కాదు ఈ సెంతెర్కి 100 ఏళ్ళ చరిత్ర కూడా ఉంది. ఏది 1891లో ప్రారంబమైంది. అప్పట్లో చిన్న చిన్న వాహనాల ద్వార మనుషుల్ని పీకి ఎక్కిన్చేవాళ్ళు. తర్వాత చిన్నగా కేబుల్ కార్ వచ్చింది. ఇపుడు కాబ్రియో వంతు. 


ఎన్నెన్ని వర్ణాలో..!





కుంచె పట్టి చకచకా  బొమ్మలు గీస్తోంది.. వేసిన చిత్రాలను ఓ చోట పెట్టి సోలోగా ఎక్సిబిషన్ కూడా పెట్టేసింది
ఎవరనుకుంటున్నారు ఓ నాలుగేళ్ల చిన్నారి.
పండగొస్తే.. లేదా స్కూల్ కి సెలవోస్తే ఏమి చేస్తారు? ఆడుకుంటారు లేదా సరదాగా పిక్నిక్ వెళ్తారు కాని వర్ణ మాత్రం అల కాదు. తన పేరులోనే కలర్స్ ని  చిన్నారి కాస్త సమయం దొరికిన బ్రష్ పట్టుకుని  బొమ్మలు గీస్తోంది. చిలుక బుద్దుడు, గణపతి ఎలా తనకు ఏది కళ్ళెదురుగా కనిపించిన తోచిన ఆ బొమ్మ పై రంగులు అద్దల్సిందే. కేవలం బొమ్మలు వేయడమే ఐతే వర్ణ గురించి చెప్పుకోవాల్సింది ఏమి లేదు కానీ ఈ చిన్నారి వేసిన చిత్రాలతో ఏకంగా ఒక సోలో ఎక్సిబిషన్ పెట్టేసింది.
ఎప్పుడు కాదు ఎలా 14 నెలల వయసునుండే వర్ణ బొమ్మలు వేయడం స్టార్ట్ చేసేసింది. దీనంతటికి కారణం వర్ణ వాళ్ళ అమ్మ లావణ్య. ఆమె ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ ఆమెనే చూస్తూ పెరిగిన వర్ణ కూడా అమ్మలానే పెయింటింగ్స్ వేయడం మొదలు పెట్టింది. ఇందుకోసం ఎవరి హెల్ప్ తీసుకోడు. తనంతకు తనే కలర్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. నచినవిదంగా బొమ్మ గీస్తుంది దాని కింద తన సంతకం కూడా పెడుతుంది. ఎలా 14నెలల వయసునుండి వర్ణ గీసిన చిత్రాలని వాళ్ళ అమ్మ అన్నిటిని   ఇపుడు వర్ణ ఎక్సిబిషన్ పెట్టింది. మొత్తం 60కి పైగా చిత్రాలు వున్నాయి. నగరంలోని డెయిరా ఆర్ట్స్ సెంటర్లో మూడు రోజుల పటు ఈ ఎక్సిబిషన్ జరిగింది. వర్ణ కూడా వచ్చిన వారికీ తన చిత్రాలను చూపిస్తూ వాటి గురించి చెబుతూ అందర్నీ ఆశ్చర్య పరిచింది. 

Thursday 18 October 2012

అగ్ని పర్వతం పేలింది.. బురద చిందింది...!







అగ్ని పర్వతం పేలింది. అందులో నుండి వేడి వేడి బురద బయటికి చిమ్మింది.. అదేంటి లవ కదా రావాల్సింది? అనుకుంటున్నారా కానీ ఇది నిజమే.. ఎందుకంటె అది బురద అగ్నిపర్వతం కాబట్టి..!
ఇండోనేషియలోని సెంట్రల్ జావా ప్రదేశంలోని చిన్న గ్రామం కువు. ఇందులోనే బ్లేడుక్ కువు అనే బురద అగ్ని పర్వతం ఉంది. అక్కడికి వెళ్లి చుస్తే పర్వతం కానీ.. పెలేందుకు రంద్రం కానీ ఏమి కనబడవు. కనిపించేది అంత ఓ బురద చెరువు అంతే. దాని నిండా బురద. మరి అగ్ని పర్వతం ఎక్కడ ఉంది అంటే.. ఆ బురదే ఆ అగ్ని పర్వతం. అందులో నుండే ప్రతి రెండు మూడు నివిశాలకు ఓ సరి పేలుడు జరిగి బురద లావలాగా బైటికి చిమ్ముతుంది. కానీ దేని వాళ్ళ ఎటువంటి ప్రమాదం ఎప్పటి వరకు జరగలేదట.
ఓ చిన్న బుడగ....
ప్రతి రెండు మూడు నిమిషాలకు ఓ చిన్న బుడగ బురధలోనుంది బైటికి వస్తుంది.. అది క్రమంగా పెద్దగ అవ్తుంది. అమాంతం పేలి పోతుంది. దాని నుండి టన్నుల కొద్ది వేడి బురద బైటికి వస్తుంది. దీనితో పతే తెల్లటి నీటి ఆవిరి కూడా పోగల కమ్ముకు పోతుంది. దీని చూసేందుకు వెళ్ళిన వాళ్ళు కనీసం ౧౦ నుండి 20 మీటర్ల దూరంలో ఉండాలి. ఎందుకంటె ఎప్పుడు ఎక్కడనుండి బురద చిన్డుతుందో చెప్పలేరు మరి.
పూర్వీకుల పని..
ఈ బురద పర్వతాన్ని స్తనికులు ఏంటో భక్తీతో కొలుస్తారు. పైగా దీన్ని వాళ్ళ పూర్వీకుల జ్ఞాపకం అని కూడా చెప్తారు. ఈ బురదలో రెండు చోట్ల ఎప్పుడు పేలుడు జరుగుతూనే ఉంటుంది వాటికీ అవ్వ, తాతా అని పేర్లు కూడా పెట్టుకున్నారు.
ఇదొక జీవనాధారం...
ఈ బురద నుండి వచ్చే అవక్షేపంలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. బురద నుండి ఉప్పును వేరు చేసి అమ్ముకుని స్తనికులు జీవిస్తున్నారు. వాళ్ళకు ఇంకా వేరే జీవనాధారం అంటూ ఏమి ఉండదు.
శాస్త్ర వేత్తలు ఏమంటున్నారంటే...
లౌత్ సుల్తాన్ లేదా హిందూ మహా సముద్రనికు సంబంధించి ఎక్కడికి సొరంగ మార్గం ఉంది ఉంటుంది. దాని వల్లే ఎలా అవుతోంది అంటున్నారు. కానీ దీనికి వాళ్ళు ఆధారాలేమీ చుపలేకున్నారు. దీని వాళ్ళ చాల సమస్యలు కూడా ఎదురవుతాయని హెచ్చరిస్తున్న.. స్తనికులు మాత్రం ఏమి పట్టిందుకోవడం లేదు.. ఎన్నో వందల ఏళ్ళుగా ఇక్కడే ఉన్న ఏమి కాలేదు అని చెబుతున్నారు.

Monday 8 October 2012

ఘోస్ట్ ట్రైన్లో విహారం..!




చీకట్లో ట్రైన్ స్పీడ్ గా వెళ్తోంది. అందులోని పిల్లలందరూ ఆడుతూ, పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సడెన్ గా దెయ్యాలు.. పిశాచాలు అన్నే ఆ రైలు ఎక్కేసాయి. అవి పిల్లలను ఏం చేసాయి? ఆ ఘోస్ట్ ట్రైన్ వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళింది? తెలుసుకోవాలంటే దెయ్యాల రైలు కథ తెలుసుకోవాల్సిందే...!
స్టాలిన్, రేమో, వోల్టేర్ అందరు ఆనందంగా రైల్లో పక్క పక్కనే కూర్చున్నారు. చుట్టూ చీకటి. అక్కడక్కడ బైట పెద్ద పెద్ద ఆకారాలు యేవో కనిపిస్తున్నై. ఇంతలో స్టాలిన్ కిటికిలోంచి బైటికి చూసాడు. అంతే 12 ఆడుగుల రాకాసి దెయ్యం.. పక్కనే చిన్న మరుగుజ్జు దెయ్యం. బయటే కాదు అవి రైల్లోకి కూడా వచేసై.. ట్రైన్ మొత్తం ఒక్కసారిగా నీలి రంగులోకి మారిపోయింది. అదేంటి ట్రైన్లోకి దెయ్యాలు ఎలా వచ్చాయి? అంటే.. వాళ్ళు ఎక్కిందే దెయ్యాల ట్రైన్ కాబట్టి. అది కూడా తెలియకుండా కాదు.. తెలిసే.. టికెట్లు కొనుక్కుని మరి ఎక్కారు. ఏంటి ఇంకా అర్థం కాలేదా..? 
ఇదంతా జపాన్లోని స్టాన్లీ పార్క్ ఘోస్ట్ ట్రైన్లో ప్రతి ఏడాది జరిగే కథే. 
భయం పోగొట్టేందుకే..
ఇది కూడా ఓ రకమైన విజ్ఞానమే అంటున్నారు స్టాన్లీ పార్క్ నిర్వాహకులు. 2007 నుండి ఇలాగే ప్రతి ఏడాది కొత్త కొత్త తేమ్స్ తో పిల్లలను బయపెడుతున్నారు. దీని ద్వార పిల్లలలోని బయన్ని పోగోత్తడమే వాళ్ళ ముక్య ఉద్దేషమట. ప్రకృతిలోని అంశాలతో అనేక చిన్న చిన్న విషయాలను నేర్పించేందుకు ఎలాంటి త్రైన్ ని సిద్దం చేసారు వాళ్ళు. ఈ ఏడాది జానపద దెయ్యలతో  అంటే పాట సినిమాల్లో మాంత్రికులు.. రాక్షసులు ఉంటారు కదా అలాంటి దెయ్యలతో త్రైన్ని సిద్దం చేసారు. అంతేనా ఇంకా ఎన్నో కొత్త విషయాలను కూడా అందులో జత చేసరన్మ్త పిల్లలు మాత్రం చాల ఎంజాయ్ చేసామని అంటున్నారు. 
ఎప్పటి వరకు...
ప్రతి ఏడాది ఈ ట్రైన్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. ఈ ఏడాది కూడా ప్రారంబం ఐపోయింది ఇంకా 31వ తేది వరకు ట్రైన్ మీ కోసం ఎదురు చుసుటు ఉంటుంది.. కాబట్టి మీరు వెళ్లి చుడోచు. 




ఐన్ స్టీన్ అవుట్!




ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్ స్టీన్నే వెనక్కి నెట్టేసింది ఓ చిన్నారి. పదునైన బుర్రతో ఆయన కన్నా రెండు పాయింట్స్ ఎక్కువే కొట్టేసింది. పనిలో పనిగా ప్రపంచ మేధావులన్దరికన్నా టాప్ అయిపోయింది.
ఉదయం చెప్పిన పాఠాలే సాయంత్రానికి గుర్తు ఉండవు. అలాంటిది మిగిలిన విషయాలన్నీ ఏం గురుతు పెట్టుకునేది అంటూ సతమతమై పోతున్నారా? ఐతే ఓ సారి మీరు ఒలివియా మ్యన్నింగ్ గురుంచి తెలుసుకోవాల్సిందే. లండన్ లోని liverpoor అకాడమీలో చదువుకుంటున్న ఓ 12  ఏళ్ళ అమ్మాయి కేవలం చదువులోనే కాదు.. ప్రపంచంలో ఏ విషయం ఐన సరే ఒక్కసారి చదివితే చాలు ఇట్టే గురుతు పెట్టుకుంటుంది. కొన్ని వందల పేర్లు ఐన సరే క్రమం తప్పకుండ అప్పజేప్పేస్తుంది. ఎటువంటి గణిత ప్రశ్నలకైన సులువుగా పరిష్కారం చెప్పేస్తుంది. ఇదంతా నేను చెప్పడం లేదు ప్రపంచ మేధావుల సంగం మెన్స చెబుతోంది. ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ గురిన్మ్చి తెలుసుగా ప్రపంచ ప్రఖ్యాత మేధావులు వాళ్ళు ఇప్పుడు వాళ్ళను మించిన్న మేదస్సు ఒలివియాకు ఉందని ఆ సంగం చెబుతోంది.
ఓ కొత్త సెలెబ్రిటి...
మేన్సాలో చేరిపోవడంతో ఇప్పుడు ఒలివియా వాళ్ళ స్కూల్ లో సెలెబ్రిటి అయిపోయింది. అంతేనా ఇందుకు తను చాలానే కష్ట పడిందంట. 'చాల మంది నన్ను వాళ్ళ హోం వర్క్ చేసి ఇవ్వమని అడుగుతుంటారు. పైగా నాకు కూడా వాళ్ళకు చెప్పడం అంటే చాల ఇష్టం. దానితో పాటుగా ఎవరైనా దీన్ని చేసి చూపించు అంటే ఇక వదిలి పెట్టన్ను. అలా నెమ్మదిగా నా మెదడుకు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టడం మొదలు పెట్టాను' అని ఆనందంగా చెబుతోంది.
మీరు చేరొచ్చు...
మేన్సాను 1946 లో ఇంగ్లండ్కు చెందినా రోలండి బెర్రిఎల్, లాన్స్ వేర్ అనే వాళ్ళు ప్రారంభించారు. వీళ్ళు తెలివైన వాళ్ళను ఒక చోట చేర్చడం కోసం దిన్ని మొదలు పెట్టారు. ఇప్పుడు ఈ సంస్థకు 100  దేసక్కి సబ్యులున్నారు. 40 దేశాల్లో మెన్సా తన సేవలను ప్రత్యక్షంగా అందిస్తోంది. ఇందులో చేరాలంటే స్తానికంగా ఉన్న మెన్సా కేంద్రాన్ని సంప్రదించాలి. వాళ్ళు పెట్టె టెస్ట్లు పాసయ్యరంటే మీరు కూడా ప్రపంచ మేధావులు అయిపోవచ్చు. ఇంకేడుకలస్యం మీ మెదడుకు పదును పెట్టడం ఇప్పటి నుండే ప్రారంభించండి మరి.

Friday 28 September 2012

మ్యాజిక్ కొండ




అదో మ్యాజిక్ కొండ.. అక్కడికి వెళ్ళే వాహనాలతో ఆడుకుంటుంది.. ఇంజిన్ ఆపి ఉన్న సరే.. వాటిని కొండపైకి లేక్కేల్తుంది.. అటుగా విమానాలు వెళ్తే అంతే సంగతి వాటిని కుదిపేస్తుంది. యెంత చిత్రంగా ఉందొ కదా.. దీని గురించి తెలుసుకోవాలంటే చదవండి.
మ్యాజిక్ కొండ పైకి వెల్లలనుకునే వాహనాలు అక్కడికి వచ్చిన తర్వాత ఇంజన్ అపెయోచు. ఎబ్డుకంటే కింది నుండి కొండ పై వరకు ఆ వాహనాలను కొండే ఎక్కిస్తుంది. క్ది కూడా గంటకు 20 కిలోమీటర్ల వేగంతో. కేవలం కింద దాని దగ్గరికి వచ్చే వాహనాలనే కాదు దాని మిద ఆకాసంలో వెళ్ళే విమానాలను కూడా ఎ కొండ తన వైపుకు లాక్కోవడానికి ట్రై చేస్తుంది. దీని నుండి తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తే కుదిపేస్తుంది.
అసలు ఎందుకిలా...
ఈ కొండకి ఏమైనా మ్యాజిక్ వచ్చా? లేదా ఏమైనా మంత్రాలూ చేస్తుంద..? అంటే ఏమి లేదు. అదొక మాగ్నెటిక్ కొండ. అంటే ఈ కొండలో ఉన్న ఖనిజ సంపద వాళ్ళ అది వాహనాలను లక్కోగాలుగుతుంది. ఎలాగంటే అయస్కాంతం ఇనుప ముక్కలను తన వైపుకు లక్కుంటుంది కదా అలాగన్నమాట.
ప్రత్యేకతలెన్నో....

లెహ్ కార్గిల్ బెటాలిక్ హైవే నుండి ౩౦ కోలోమీటేర్స్ దూరంలో ఉన్న ఈ మాగ్నెటిక్ కొండ సముద్ర మట్టానికి 140000 అడుగుల ఎతులో ఉంది. దీనికి తూర్పున సిందూ నది ప్రవహిస్తోంది. ఈ నది టిబెట్లో పుట్టి  యిక్కడి నుండి పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. ఈ కొండ దగ్గరలోనే ఇండియన్ అర్మి వారు నిర్వహిస్తున్న గురు ద్వార కూడా ఉంది. ఈ దేవాలయం సిక్కుల మత గురువు గురు నానక్ దేవ్ పేరున ఏర్పాటు చేసారు. ఎటువంటి ఎన్నో కారణాల వాళ్ళ ఈ కొండ చాల ప్రసిద్దికెక్కింది. 

Wednesday 26 September 2012

చిట్టి చిలకమ్మా..! రికార్డు నీదేనమ్మ..!




జాక్ ఎక్కడికైనా వెళ్లిందంటే సందడే సందడి.. అది సైకిలేక్కితే చప్పట్లు.. స్కేటింగ్ చేస్తే కేరింతలు... బాస్కెట్ బాల్ ఆడితే గిన్నీస్ రికార్డ్స్... ఇంతకి జాక్ ఎవరో తెలుసా..? ఓ చిలకమ్మ..!
సర్కస్ లలో ఎన్నో రకాల పక్షులను, వాటి విన్యాసాలను చూస్తుంటాం. సైకిల్ తొక్కడం, రింగులో పరిగెట్టడం.. కానీ ఎప్పుడు మనం చెప్పుకుంటున్న చిలకమ్మ ఏకంగా బాస్కెట్ బాల్ అతనే నేర్చేసింది. తన ప్రతిబ చూడమంటూ అందరిని పిలిచింది. పనిలో పనిగా గిన్నిస్ వాళ్ళు కూడా అక్కడికి వెళ్లారు. వాళ్ళ ముందు దర్జాగా అటు ఎటు తిరిగింది.. సైకిల్ తొక్కింది.. స్కేటింగ్ చేసింది.. విజయం నాడే అని ముందుగానే విజయ పతాకాన్ని తీసి అందరికి చూపి ఆటలో దిగింది.
రికార్డు ఇలా
బాస్కెట్ బాల్ గురించి తెలుసుగా జట్టుల వారీగా అదే అట. బంతి పై నుండి బుట్టలో వేయడం ద్వార పాయింట్స్ స్కోరు చేస్తారు. గేమ్ ముగిసే సమయానికి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తే ఆ టీం విజేతగా నిలుస్తుంది. కానీ ఇక్కడ జాక్ ఒక్కటే గేమ్ మొత్తం ఆడింది. అన్ని పాయింట్స్ సొంతం చేసుకుంది. ఒక్క నిమిషంలో అదికంగా పాయింట్స్ సంపాదించినా చిలకగా గిన్నిస్ రికార్డు పట్టేసింది. అంతే గతంలోనూ 60 సెకండ్స్లో ఎక్కువ సోడా బాటిల్ల్స్ మూతలను తీసిన చిలకగా రికార్డు సాధించింది కూడా.
ఇవన్నీ ఎలా నేర్చిందంటే...
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే జులి, కర్దోజా పక్షులకు శిక్షణ ఇవ్వడంలో ఏంతో నేర్పరులు. అల శిక్షణ ఇచ్చిన పక్షులతో వివిధ వినోద కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళు. అలా వాళ్ళు శిక్షణ ఇచ్చిన చిలుకే జాక్. హర్లెక్విన్ మకావ్ జాతికి చెందినది. చిన్నగా ఉన్నపుడు జులి వాళ్ళ దగ్గరికి వచ్చింది. అప్పటి నుండి 22 సంవస్తరాలుగా జాక్ శిక్షణ తీసుకుంటోంది. ఇప్పుడు జాక్ వయసు 25 మనుసులలగానే దేనికి ఇది రిటైర్ మెంట్ వయసత. ఈ వయసులోనూ జాక్ ఏంతో చురుగ్గా అట అది రికార్డు సాధించడం ఏంతో ఆనందంగా ఉందని శిక్షకులు చెప్తున్నారు.
అంతేనా...
జాక్ కేవలం ఆటలే కాదు.. మాటకారి కూడా.. దానికి 100 కన్నా ఎక్కువ పదాలు తెలుసు. కారులో షికారుకు తిసుకేల్తే ఎంచక్కా కబుర్లు చెప్తుంది. మరిన్ని రికార్డ్లు సాదిస్తానని పోజులు కూడా కొడుతుంది. మరి చిలక మజాకానా!