Search This Blog

Friday 2 May 2014

భలే దుంప..!

b-kathaఅనగనగా కొంత కాలం క్రితం ఒక అడవిలో ఒక తాత వుండేవాడు. ఆయన ప్రతి సంవత్సరం దుంపలను పండించేవాడు. అవి ఎంతో లావుగా చాలా రుచిగా వుండేవి. ఎప్పటిలాగానే ఆ ఏడాది కూడా దుంపల విత్తనాలను చల్లి వాటిని జాగ్రత్తగా పెంచడం ప్రారంభించాడు. ఆ ఏడాది మాత్రం ముసలాయన చాలా సంతోషపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడూ లేనిది ఓ ఈ సారి మాత్రం ఓ పెద్ద దుంప తయారైంది. దాన్ని ఇంకా పెంచాలని ఆ తాత అలాగే వదిలేశాడు. ఇంకా పెద్దగా అయ్యే వరకు వుంచేశాడు. ఆ దుంప రోజు రోజుకీ ఇంకా ఇంకా పెద్దగా పెరిగి పెద్దదయిపోతోంది. అది ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే దాన్ని చూసి అందరూ చూసి ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. కొంత కాలం తరువాత ఆ దుంప పెరగడం ఆగిపోయింది. అప్పుడు తాత ఆ దుంపను తీయాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టు ఆకులను పట్టుకుని లాగడం ప్రారంభించాడు. ఎంత సేపు లాగినా అది కొంచెం కూడా కదలేదు. అలా పాపం లాగుతూనే వున్నాడు. ఊహూ.. ఆ దుంప మాత్రం కదల్లేదు.

ఇక విసుగొచ్చిన తాత వాళ్ళ అవ్వను పిలిచి కాస్త సాయం చేయమని అడిగాడు. తాత ఆ చెట్టును పట్టుకుని లాగుతుంటే అవ్వ ఆయన్ను పట్టుకుని లాగడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి అలా ఎంత సేపు లాగినా కూడా అది రాలేదు. కొంచెం కూడా కదల్లేదు. ఇక అవ్వ కూడా చేసేదేమీ లేక తన మనవరాలిని సాయం చేసేందుకు పిలి చింది. మనవరాలు పరిగె త్తు కుంటూ వచ్చింది. వాళ్ల అవ్వను పట్టుకుని లాగడం మొదలు పెట్టింది. అవ్వేమో తాతను పట్టుకుని లాగుతోంది. తాతేమో ఆకుల్ని పట్టుకుని లాగుతూనే వున్నాయి. అయినా కూడా ఆ దుంప బయటికి రానే లేదు.

మనవరాలేమో తన పెంపుడు కుక్కను సాయం చేయమని పిలిచింది. కుక్క మనవరాలిని, మనవరాలు అవ్వని, అవ్వ తాతని, తాతేమో దుంప ఆకుల్ని పట్టుకుని లాగడం మొదలు పెట్టారు. ఊహూఁ అయినా కూడా దుంప బయటికి రాలేదు. ఎంత సేపు ప్రయత్నించినా కొంచెం కూడా కదల్లేదు.

వెంటనే కుక్క తన స్నేహితురాలు పిల్లిని సాయం చేయమని బతిమాలింది. తన స్నేహితుడి బాధ చూడలేక పిల్లి కూడా వచ్చి వాళ్ళకు సాయం చేయడానికి కుక్కను పట్టుకుని వెనక్కు లాగడం ప్రారంభించింది. ఇలా ఒకర్ని ఒకరు పట్టుకుని ఎంత ప్రయత్నించినా దుంప మాత్రం బయటికి రాలేదు.
చివరికి పిల్లికి కూడా విసుగొచ్చింది. వెంటనే ఆలోచించి తన స్నేహితురాలు ఎలుకను సాయం కోరింది. ఎలుక కూడా పరిగెడుతూ వచ్చేసింది. ఎలుక పిల్లి చేయి పట్టుకుని లాగింది. పిల్లి కుక్కను పట్టుకుని లాగింది. కుక్క మనవరాలిని, మనవరాలు అవ్వని పట్టుకుని గట్టిగా లాగాయి. అవ్వ తాతను గట్టిగా లాగింది. తాత చెట్టు ఆకులను పట్టుకుని చాలా కష్టపడి లాగి లాగి... చివరికి చాలా సేపటి తరువాత దుంప బయటికి వచ్చేసింది. అంతా ఒకరి మీద ఒకరు పడిపోయారు. తరువాత అందరూ కలిసి దుంపను పంచుకున్నారు. 
-ధరణి(హైమ సింగతల)
budugu, surya telugu daily, March 6, 2011

Thursday 1 May 2014

భారతీయ మహిళలు... స్ఫూర్తిదాయక నాయికలు..

ప్రపంచంలో 100 మంది స్ఫూర్తిదాయక మహిళల్లో ఐదుగురు భారతీయ మహిళలు చోటు దక్కించుకోవడం హర్షణీయం. ‘ది గార్డియన్‌’ పత్రిక ఇటీవల విడుదల చేసిన ఈ జాబితాలో రచయిత్రి అరుంధతీరాయ్‌, పౌర హక్కుల కార్యకర్త జయశ్రీ, పర్యావరణ ప్రేమికురాలు వందనాశివ, వైట్‌ రిబ్బన్‌ అలయన్స్‌ కో ఆర్డినేటర్‌ అపరాజిత గగోయ్‌, గులాబీ దళం నాయకురాలు సంపత్‌పాల్‌ దేవిలకు అరుదైన స్థానాలు దక్కాయి.

Jayshreeఈ జాబితాలో మరికొందరు భారతీయ సంతతికి చెందిన సిఇఓ ఇంద్రానూయి, దర్శకురాలు మీనా నాయర్‌, సౌత్‌ ఆల్‌ బ్లాక్‌ సిస్టర్స్‌ వ్యవస్థాపకురాలు ప్రజ్ఞాపటేల్‌, కర్మ నిర్వాణ సంస్థ స్థాపకురాలు జస్వీందర్‌ సంఘేరా కూడా స్ఫూర్తిదాయక మహిళల్లో స్థానం సంపాదించుకుని భారతీయ మహిళల పేరును ఖం డాంతరాలకు వ్యాపించేలా చేశారు. ఈ 100 మంది మహిళలను ఎంపికలో పరిగణ లోకి తీసుకున్న అంశాలు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో విజయాలు సాధించిన మహిళలు, వారి ప్రతిభ వంటివాటిని ప్రా మాణికంగా తీసుకున్నారు. 

ప్రపంచం మొత్తంగా రోల్‌ మోడల్‌గా వున్నవారికి వీరిలో స్థానం కల్పించారు. అలాగే సుదీర్ఘ కాలం పాటు పోరాటాలు చేసిన మహిళల చరిత్రలు కూడా ఎంతో పరిశీలించారు. ఈ ఎంపికలో 3వేల మంది పాఠకుల సలహాలను, సూచనలను కూడా వారు తీసుకున్నారు. అనంతరం ఎంపికకోసం ప్రత్యే కంగా ఒక ప్యానెల్‌ను ఏర్పాటు చేశారు. వీరిలో సారా బ్రౌన్‌, ఎమ్మా ఫ్రూయిడ్‌, వైట్‌ రిబ్బన్‌ అలయన్స్‌ నుండి బ్రిగిడ్‌ మెక్‌కేన్‌విల్లె, ఆర్ట్స్‌ కౌన్సిల్‌ ఛైర్మెన్‌ లిజ్‌ ఫార్గాన్‌, ఛానల్‌ 4 న్యూస్‌ రిపోర్టర్‌ షామీరా అహ్మద్‌, క్లారా మార్గెట్‌సన్‌, నటాలి హన్మాన్‌, ఎమినే సానెర్‌, కాథరీన్‌ వినెర్‌లు నిర్ణే తలుగా వ్యవహరించారు.

మొదట తయారు చేసిన లిస్టును క్యాటగిరీస్‌గా విభజించి ఆయా రంగాల్లో వారి విజయాలు, వారు అనుసరించిన మార్గాలను ప్రత్యేకంగా పరిశీలించాలి. విజయాల కోసం ఎక్కువగా కష్టపడిన వారి ఆధారంగా వారికి నెంబర్లను ఇచ్చారు. అందులోనూ ఎక్కువ మందికి మార్గనిర్దేశకంగా నిలిచిన మహిళలను ఎంపిక చేశారు. ఇందులో డబ్బు లేదా,అధికారం వంటి వాటిని ఏ మాత్రం పరిగణ లోకి తీసుకోలేదని గార్డియన్‌ పత్రిక ఎడిటర్‌ చెబుతు న్నారు. ఇది కేవలం స్ఫూర్తిదాయక మహిళలకు సం బంధించనదే అని తెలిపారు.ఇందులో కొన్ని నిర్ణయాలు, కొందరి ఎంపిక వివా దాస్పదం అయినా, వారి వారి స్థాయిల్లో వాటిని పరిశీ లించిన తరువాత తీసుకున్న నిర్ణయంగా ప్రకటించారు. 

womensవిధుల్లోనూ అందంగా...కొన్ని రకాల విధుల్లో ముఖ్య పాత్ర పోషించే మహిళలకు రూపం.. మాట తీరు..చాలా అవసరం.రిసెప్షనిస్టు వంటి ఉద్యోగాలకు ఇవి మరింత ముఖ్యం. చూడ చక్కని రూపంతో..పాజిటివ్‌ దృక్పథంతో వీరు పని చేయాల్సి వుంటుంది.అందుకు కొన్ని కొన్ని చిట్కాలను కూడా పాటించాల్సి వుంటుంది. ఆఫీసుకు వెళ్ళేప్పుడు మరీ ఎక్కువగా హం గులతో కాకుండా సహజ సిద్ధంగా వుండేం దుకు ప్రయత్నించాలి. కంటి రెప్పలకు మరీ ఎక్కు వగా కాకుండా లైట్‌గా మస్కారా వుపయోగించాలి.చెంపలమీద ముదురు రంగులను మరచి లేత రంగుల్లో వుండే షేడ్స్‌ వేయాలి. పెదవులపై పీచ్‌ షేడ్స్‌ని వేసుకుంటే మంచి ఆకర్షణ వస్తుంది పెద వులు కూడా అందంగా మెరుస్తాయి. 

ఫౌండేషన్‌: ముందుగా ఫౌండేషన్‌ని చిన్న చిన్న చుక్కలుగా ముఖం మీద పెట్టిన తరువాత.. దాన్ని నెమ్మదిగా పూర్తిగా పరుచుకునేలా రాసుకోవాలి. ముదురు రంగుని బ్లషర్‌తో చెంపలమీద పూర్తిగా బేస్‌లా రాసుకోవాలి.కళ్లకు: సహజ సిద్ధంగా వుండే రంగులను వుప యోగించాలి. వాటివెంట బ్రౌన్‌ ఐ లైనర్‌ని వేయాలి. కనురెప్పలను మస్కారాతో చక్కగా దిద్దు కోవాలి.

చెంపలపై: శరీర ఛాయ కంటే కాస్త ముదు రుగా వుండే రంగును చెంపలమీద షేడ్‌ వేసు కోవాలి.చెంపలకు కాస్త పైన వుండే ఎముక భాగం లో మినరల్‌ మేకప్‌ వేసుకోవాలి. వాటర్‌ప్రూఫ్‌ మేకప్‌ వేసుకుంటే మరింత బాగుంటుంది. పెదవులపై: ముదురు పీచ్‌ రంగులను పెద వులపై వేసుకుంటే ఎంతో అందంగా మెరుస్తాయి. లిప్‌స్టిక్‌ వేసిన తరువాత దానిపై షైనింగ్‌ వుండా లంటే లిప్‌ గ్లాస్‌ను కూడా అప్లై చేయాలి.
-హైమ సింగతల
surya telugu daily,  March 11, 2011