Search This Blog

Sunday 10 August 2014

నేత్రదానం చేద్దాం వారి కళ్లలో వెలుగుచూద్దాం

కొద్ది క్షణాలపాటు ఈ లోకమంతా చీకటి కమ్మేస్తే... ప్రాణం పోరునట్లు బాధపడతాం... అంత చీకటిని భరించలేక అల్లాడిపోతాం... కళ్లు నలుపుకుంటూ ఆ చీకటిని దాటి చూసే ప్రయత్నం చేస్తాం.. అటువంటిది పుట్టుకతో లేదా ప్రమాద వశాత్తు కళ్లు పొగొట్టుకున్న వాళ్లకు జీవితాంతం అన్ని క్షణాలు చీకటే.. ఎంతగా ఎదిగినా ప్రపంచాన్ని చూడలేమన్న బాధే...! అటువంటి వారికి చూపునిచ్చే అవకాశం మనేక వస్తే... మనం చనిపోరుున తరువాత కూడా మన కళ్లకు మరో జీవితం లభిస్తే.. అంతకన్నా ఆనందం మరొకటి వుండదు. మరి నేత్రదానం చేస్తే ప్రతిఒక్కరూ ఈ ఆనందాన్ని పొందవచ్చు.

దేశంలో ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది అంధులు ఉన్నట్లు ఒక అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధుల సంఖ్యలో మూడో వంతు. ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే 1.60 కోట్ల కళ్లు ఏటా మట్టిలో కలిసిపోతున్నారుు. ఈ కళ్లన్నింటినీ అంధులకు అందించగలిగితే ఐదేళ్లలోనే దేశంలో అందరికీ చూపు ప్రసాదించే అవకాశం ఉంది. 

ప్రపంచ అంధత్వానికి పుట్టినిల్లుగా వెలుగొందుతున్న మన భారతదేశంలో తాజా నివేదికల ప్రకారం 15 మిలియన్ల మంది అంధులున్నారు. వీరిలో కొందరు పాక్షిక, పూర్తి శాతం అంధత్వం వున్నవాళ్లున్నారు. వీరిలో సగానికి పైగా సరైన వైద్య సదుపాయాలు దాతలు దొరికితే వారి జీవితంలో రంగులను సంతరించుకునే అవకాశం వుంది. అందుకే భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సెప్టెంబర్‌ 8వతేదీని ‘నేషనల్‌ ఐ డొనేషన్‌ డే’గా ప్రకటించింది. 


మరో జీవితం...
జీవించి ఉన్నంత కాలం కంటి చూపును అనుభవించి.. మరణించాక మన శరీరంతో పాటు కళ్లను మట్టిలో కలిసిపోనీయకుండా వాటిని వేరొకరికి అమర్చేందుకు అంగీకరిస్తే చాలు.. చావు తర్వాత మన కళ్లతో వారికి చూపు కల్పించగలం. దీనికి కావాల్సింది ఒక్కటే మనలో చైతన్యం. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ శరీరంలో కొన్ని అవయవాలు లేకున్నా రోజులు గడిపేయగలం. కానీ కంటి చూపు లేకుంటే మాత్రం జీవితం ఎంత దుర్బరమో అది అనుభవించే వారికే తెలుస్తుంది. ఈ రోజున కంటి చూపులేని వాళ్లు లక్షల్లో ఉన్నారు. మనమంతా తలచుకుంటే కొన్ని సంవత్సరాల్లో వారికి చూపును అందివ్వగలం. 

చైతన్యంతో ఆలోచిస్తే... అది మన చేతుల్లో పనే. దేశంలో ఇప్పటి వరకు 4.5 కోట్ల మంది అంధులు ఉన్నట్లు ఒక అంచనా. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అంధుల సంఖ్యలో మూడో వంతు. ప్రతి ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. అంటే 1.60 కోట్ల కళ్లు ఏటా మట్టిలో కలిసిపోతున్నాయి. ఈ కళ్లన్నింటినీ అంధులకు అందించగలిగితే ఐదేళ్లలోనే దేశంలో అందరికీ చూపు ప్రసాదించే అంకాశం ఉంది. కనీసం ఇందులో ఐదో వంతు కళ్లు సేకరించి అమర్చగలిగినా ఎంతో మందికి ఈ ప్రపంచాన్ని వాళ్ల కళ్లతో చూసే భాగ్యాన్ని కలిగించగలం. కొన్నేళ్లలోనే పూర్తిగా దేశంలోని అంధులందరికీ చూపు ప్రసాదించవచ్చు. 

eyessనేత్రదానం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మద్రాసు మెడికల్‌ కాలేజీ ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ కాలేజీలోని నర్సింగ్‌ విద్యార్థులు వెరుు్య మందిని ఖాళీ సమయాల్లో నేత్ర దానం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధం చేస్తోంది. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఎనిమిది ఆస్పత్రులకు వచ్చే 16 వేల మంది అవుట్‌ పేషెంట్లు, 8 వేల మంది ఇన్‌ పేషెంట్లకు నేత్ర దానం పట్ల అవగాహన కల్పించాలన్నది వారి కార్యక్రమ లక్ష్యం.

నేత్రదానం...
ఈ అవసరాన్ని, నేతద్రాన విశిష్టతను చాలా మంది బాగానే గుర్తిస్తున్నారు. ఊర్లకు ఊర్లే నేత్రదానం చేసేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ ఇది సరిపోదు. ఇప్పటికీ చదువులేని వారిని పక్కన పెడితే, చదువుకొని విజ్ఞానవంతులుగా చెలామణి అవుతున్న వాళ్లు కూడా తమ కళ్లను దానం చేసేందుకు ముందుకు రాని పరిస్థితులు ఉన్నాయి. తాము చనిపోయిన తర్వాత నిరుపయోగంగా తమ శరీరంతోపాటు మట్టిలో కలిసిపోయే కళ్లను మరొకరిస్తే అది ఎంత ప్రయోజనమో వీరికి తెలిసినా అందుకు సిద్దపడని మూఢ విశ్వాసులు ఉండడం విషాదకరం. ఇలాంటి నమ్మకాలను ఇకనైనా వీడాలి. 

అవగాహనే లక్ష్యంగా...
ఇటీవలి కాలంలో ఐ డొనేషన్‌ పట్ల అవగాహన కల్పించేందుకు స్వచ్ఛందంగా సంస్థలు ముందుకొస్తున్నాయి. మద్రాసు మెడికల్‌ కాలేజీ ఇందుకు ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. ఈ కాలేజీలోని నర్సింగ్‌ విద్యార్థులు వెయ్యి మందిని ఖాళీ సమయాల్లో నేత్ర దానం పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధం చేస్తోంది. మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఎనిమిది ఆస్పత్రులకు వచ్చే 16 వేల మంది అవుట్‌ పేషంట్లు, 8 వేల మంది ఇన్‌ పేషంట్లకు నేత్ర దానం పట్ల అవగాహన కల్పించాలన్నది వారి కార్యక్రమ లక్ష్యం. 

ఈ కార్యక్రమంలో పాల్గొనే నర్సింగ్‌ విద్యార్థులకు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. వచ్చే వారంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి వచ్చే ఏడాది ఈ సమయానికి ఎంత ఎక్కువ మందితో వీలైతే అంత ఎక్కువ మందితో నేత్ర దానంపట్ల ఉన్న తప్పుడు విశ్వాసాలను తొలగించి కనీసం ఐదు లక్షల మంది నేత్రాలను సేకరించాలన్నది తమ లక్ష్యమని కాలేజి వర్గాలు చెబుతున్నాయి. 

అవగాహన లేకపోవడం వల్లే...
విషయం పట్ల అవగాహన కల్పిస్తే కళ్లను దానం చేసేందుకు ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. వారిని నేత్ర దాన అంగీకార పత్రాలపై సంతకాలు చేయించే దిశగా నడిపించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు ఇంకా పెద్ద ఎత్తున చేపడితే సత్ఫలితాలు సాధించడం పెద్ద విషయమేం కాదు. 
కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల అందించిన లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ జనాభాలో 2.24 శాతం మంది అంధులున్నారు. అసోం మొత్తం జనాభాలో నాలుగు శాతం చూపులేనివారున్నారని అంచనా. ఉత్తర ప్రదేశ్‌లో ఆ సంఖ్య 15.6 లక్షలు. 

ఆ తర్వాత ఢిల్లీదే. ఇక్కడ 15.5 లక్షల మంది అంధులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. బెంగాల్‌లో 9.5 లక్షలు, కర్ణాటకలో 9.3 లక్షలు, మహారాష్ర్టలో 9.1 లక్షల మంది చూపులేనివారున్నారని సమాచారం. ఒడిషాలో 5.13 లక్షల మంది, మధ్యప్రదేశ్‌లో ఏడు లక్షలు, బీహార్‌లో 6.46 లక్షలు, హర్యానాలో ఆ సంఖ్య 3.98 లక్షలు. ఇంత పెద్ద సంఖ్యలో అంధులు దేశంలో ఉన్నా అందుకు అవసరమైన స్థాయిలో నేత్రదానాలు మాత్రం జరగడం లేదు. 

ప్రపంచ కేంద్రంగా...
తాజా సర్వేల ప్రకారం భారతదేశంలో 15 మిలియన్ల మంది అంధులున్నారు. 6.8 మిలియన్‌ ప్రజలు 6/60 అంధత్వాన్ని కలిగివున్నారు. వీరికి నేత్ర దానం చేయగలిగితే వారు పూర్తి చూపును పొందగలుగుతారు. అలా కాకుండా ఇదే కొనసాగితే 2010 నాటికి ఈ అంధత్వం 10.6 శాతానికి పెరిగే అవకాశం వుంది.

ఇప్పటి వరకు... 
ఇప్పటి వరకు అనేక గ్రామాలకు గ్రామాలే నేత్రదానం దానాన్ని చేశాయి. ఈ వరుసలో ఇప్పుడు విజయనగరం జిల్లా చీపురుపల్లి గ్రామం కూడా చేరింది. గ్రామం మొత్తం నేత్ర దానం చేసేందుకు సమాయత్తమైంది. అంధులకు చూపును ప్రసాదించి వారికి కొత్త జీవితాన్ని అందించేందుకు గ్రామవాసు
లు నడుం బిగించడం విశేషం.

సాటి వారికి చూపునిద్దాం...
తూరుపు కొండల మాటు నుంచి లేలేత నారింజ రంగుతో ఉదయించే భానుడు.. చిరు జల్లులు కురిసే వేళలో ఉద్భవించే ఇంద్రధనస్సు.. పురి విప్పి ఆడే నెమలి.. పచ్చటి వరిచేలు.. విరబూసి మదిని మురిపించే రంగురంగుల పుష్పాలు.. సప్తవర్ణ శోభితమైన ఈ ప్రపంచం... ఒక్కసారిగా చీకటి మయం... అయితే... ఇటువంటి ఊహనే భరించలేం. అందుకే మన తరువాత మన కళ్లకు అటువంటి వారికి తోడయ్యే అవకాశాన్నిద్దాం. చనిపోయిన తరువాత కూడా వాటికి జీవితానిద్దాం.
- అక్షర


కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి...
మనిషి చనిపోయినా కూడా అతనిలోని కొన్ని అవయవాలు ఇతరులకు ఉపయోగపడతాయి. వారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి. కాబట్టి ప్రతిఒక్కరూ అవయవాలను దానం చేసేందుకు ముందుకు రావాలి. ఇందుకోసం మోహన్‌ ఫౌండేషన్‌ స్థాపించిన 1997 సంవత్సరం నుంచి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషిచేస్తోంది. అన్ని అవయవాల కంటే కళ్లు ఎంతో ప్రధానమైనవి. కళ్లు లేకపోతే జీవితమే అంధకారంగా మారుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిఒక్కరూ కళ్లను దానం చేసేందుకు ముందుకు రావాలి. తాము చనిపోయినా తమ కళ్లకు మరొకసారి ప్రపంచాన్ని చూసే అవకాశం కల్పించాలి. 
-డాక్టర్‌ సునీల్‌ ష్రాఫ్‌, మోహన్‌ ఫౌండేషన్‌.


అంధత్వ నివారణ కోసం కృషి...
నేత్ర దానం గురించి దేశంలోని చాలామందికి తెలియదు. చనిపోయిన తర్వాత కళ్లను దానం చేయవచ్చన్న విషయం ప్రజలకు తెలియజేసేందుకు ఐ బ్యాంక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా కృషిచేస్తోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందు కు తరచుగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో కేంద్రాలను ఏర్పాటుచేసి పనిచేస్తున్నాము. దీంతో పాటు వివిధ కారణాల వల్ల సంభవించే అంధత్వ నివారణం కోసం కూడా సంస్థ కృషిచేస్తోంది. దేశంలోని ఐ బ్యాంక్స్‌కు అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందిస్తున్నాము. 
-డాక్టర్‌ రేఖ జ్ఞాన్‌చంద్‌,
ఐ బ్యాంక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.


ఎవరు చేయవచ్చు...
ఎవరైనా నేత్రదానం చేయవచ్చు. సంవత్సరం వయస్సు నుండి ఏ వయసు వారైనా సరే.... హైపర్‌ టెన్షన్‌, డయాబెటిస్‌, ఆస్తమా, ట్యూబర్‌కొలోసిస్‌ వంటి వ్యాధులతో బాధపడేవారైనా సరే తన కళ్లను డొనేట్‌ చేయవచ్చు. కంటి ఆపరేషన్లు జరిగిన వారు, కాటరాక్ట్‌ ఆపరేషన్లు చేయించుకున్న వాళ్లు, ముసలివారు ఇలా ఎవరైనా సరే కళ్లను దానం చేయొచ్చు. 

ఎక్కడ చేయాలి...
ఎక్కడికో వెళ్లి చేయాల్సిన అవసరం లేదు. స్థానికంగా అనేక స్వచ్ఛంధ సంస్థలు నేత్ర దానం చేయించేందుకు ముందుకొస్తున్నాయి. నేషనల్‌ ఐ డొనేషన్‌ డే సందర్భంగా స్వచ్ఛందంగా హెల్త్‌ సెంటర్లను నిర్వహిస్తున్నాయి. లేదంటే ఐ డొనేషన్‌ సెంటర్స్‌ వుంటే అక్కడికి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవచ్చు. చేయాల్సిందల్లా చెప్పిన విషయాలను అవగాహన చేసుకుని సహకరించ
డం మాత్రమే. 

నా స్నేహితులకూ చెబుతాను...rakesh
కళ్లు దానం చేయడం గురించి నాకు తెలియదు. ఇప్పుడు దీని గురించి తెలిసింది. అందుకే ‘నేషనల్‌ ఐ డొనేషన్‌ డే’ సందర్భంగా నా కళ్లను దానం చేస్తున్నాను. అలాగే నా స్నేహితులకు కూడా దీని గురించి చెప్పి చేయిస్తాను. నా కళ్లతో మరొకరికి ప్రపంచాన్ని చూసే అవకాశం వస్తుందంటే అంతకు మించిన సంతోషం ఇంకేం కావాలి.
-నిమ్మల రాకేష్‌, హైదరాబాద్‌.


చాలా సంతోషంగా ఉంది...chandra-shekar
మనం చనిపోయిన తరువాత కూడా మన కళ్లు మరొకరికి ఈ ప్రపంచాన్ని చూపిస్తాయంటే అంతకన్నా ఇంకేంకావాలి. ఈ అవకాశం నాకు వచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు నేత్ర దానం చేయండి. చూడలేని మరొకరికి చూపునివ్వండి.
- సి.హెచ్‌.చంద్రశేఖర్‌, ఖమ్మం.




ఎవరైనా చేయవచ్చు...
Sreedhar-reddy
ప్రపంచంలోని అన్ని దేశాలకంటే మన దేశంలోనే అంధత్వం ఎక్కువగా వుంది. మనలాంటి వాళ్లందరూ చేతులు కలిసి నేత్ర దానం చేస్తే దీన్ని రూపుమాపడం చాలా తేలిక. అందరు కూడా నేత్ర దానం చేయండి. దీని వల్ల ఎటువంటి సమస్యలూ వుండవు. ఎవ్వరైనా చేయొచ్చు.
-జి.శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు.



-హైమ సింగతల
(surya telugu daily September 8, 2011)

No comments:

Post a Comment