Search This Blog

Thursday 14 August 2014

పాకిస్థానీ మధర్‌ థెరిస్సా

సిస్టర్‌ ఫా.. కర్ర సాయం లేనిదే నడవడం సాధ్యం కాదు.. ఆమె చుట్టూ వాతావరణం భయంకరం... బాంబుల మోతతో, గాయాలతో దేహాలు చీరుకుపోయిన జనం... వరదలతో అల్లాడే ప్రాంతం...ఇవే ఆమె ఆవాసం.. వారి సేవే లక్ష్యం.. 
రూత్‌ కేథరినా మార్థా ఫా... 1929లో జర్మనీ లోని లీప్‌జిగ్‌లో జన్మించారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎంతో భయం, వత్తిళ్ల మ ధ్య పెరిగారు.వైద్య విద్యను పూర్తి చేసి 1950వ సంవత్సరంలో ‘డాటర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌ ఆఫ్‌ మేరీ’ లో చేరారు. ఆ సంస్థ తరపున సేవ చేసేందుకు భారత్‌కు 1960లో పయన మయ్యారు. కరాచీ లో వీసా కోసం వేచి వున్న సమయంలో కుష్టు వ్యాధి బాధితుల కాలనీని సందర్శించారు. వారి జీవన విధానం ఆమె మనసు మార్చేసింది. అప్పుడే ఆమె నిర్ణయిం చుకుంది కుష్టు వ్యాధి పీడితులకు సేవ చేయాలని. 

ఇప్పుడు ఆమె వయస్సు 81 ఏళ్లు. పాకిస్తా నీ మధర్‌ థెరిస్సాగా అక్కడి స్థానిక ప్రజలం దరికీ ఆమె పరిచ యమే. 50 సంవత్సరాల కుపైగా తన జీవితాన్ని వారి కోసమే అంకి తం చేసింది. పేదలకు, బహిష్కరణకు గురై న వారి కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ‘ప్రపంచంలో భయంకరమైన ఉగ్రవాద దేశాల్లో పాకిస్తాన్‌ ఒకటి’ ఆల్‌ఖైదాకు సం బంధించి వాషింగ్‌టన్‌ పత్రిక ఒకటి ఈ మాటను చెప్పింది. ఇది అక్కడి ప్రజల జీవ న విధానానికి వారి కష్టాలను ప్రతిబింబి స్తోంది. పాకిస్తానీ మిలిటరీ ఆపరేషన్స్‌, మరోవైపు వాయువ్య ప్రాంతంలో ఆఫ్ఘనిస్తా న్‌ ఇలా అన్నీ సమస్యలే... 

ఈ మూడు సంవత్సారాల్లో దాదాపు నాలుగు వేల మంది ప్రజలు అక్కడి బాం బుల దాడుల్లో మృతిచెందారు. ఇక కిడ్నా ప్‌లు
సర్వసాధారణం. మిలిటరీ గ్రూపుల అలజడులు, ఇవన్నీ మామూలు విషయాలు. ‘నేను ఎక్కడా ఏ సమస్యలు ఎదుర్కోలేదు. ఎం దుకంటే ప్రజలకు నేను తెలుసు. నాకు ఎటు వంటి అవాంతరాలు కల్పించరు. వారి సా యం నాకు ఎప్పుడూ వుంటుంది. అది సరి హద్దు ప్రాంతమైనా సరే. నేను వెళ్తాను. నా పని చేసుకుంటాను’ అని సిస్టర్‌ చెబుతు న్నారు. 

1960లో కరాచీలో ఆమె చూసిన దృష్యం ఇప్పటికీ ఆమెకు గుర్తే.ఆమె చూసిన కాలనీలో ఎక్కడ పడితే అక్కడ అంతా రోగుల మయం. కనీసం లేవడానికి కూడా వారికి ఓపిక లేదు. వారి దెబ్బల నుండి రక్తం ధారలుగా కారుతోం ది. మరోవైపు ఎలుకలు వారి శరీరాలను తినేస్తు న్నాయి.. బతికే వున్నా వాటిని పట్టించుకునే స్థితి లో వారు లేరు. 1960 మిగిలినదంతా చరిత్ర. ఆమె పాకిస్తాన్‌లో నిలిచిపోయింది.అక్కడి కుష్టురోగులకు సా యం చేసేందుకు ఆమెలోని మానవతా శక్తి అక్క డే ఆగిపోయింది.

అక్కడ నివసించే పరిస్థితిలు చాలా దారుణం. అక్కడి కుష్ఠురోగుల జీవన విధానం ఎంతో దారుణం. ఆ వాతావరణంలో అక్కడి వారిని ఎలుకలు కొరుకు తున్నా తెలుసు కోలేని స్థితిలో వారున్నారు.‘వారిని చూసిన వెం టనే నిర్ణయిం చుకు న్నా. అక్కడ ప్రజలు జంతువుల్లా బతుకు తున్నారు. తిండి లేదు...వుండేందుకు గూడు లేదు. తమ తలరాత ఇంతే అని వారు అలవాటు పడి పోయారు. కా నీ అది వారు తల రాత కాదు. వారు మంచి జీవితాన్ని పొందాలి. అందుకే నేను అప్పుడే నిర్ణ యం తీసుకున్నా ను. వారిని ఎలా గైనా ఆ స్థితి నుండి బయట పడేయా లని’ అని చెబు తున్నారు.ఆ సంఘటనల అనంతరం సిస్టర్‌ తన పయనాన్ని మార్చు కున్నారు. అక్కడే ఒక క్లినిక్‌ని ఏర్పాటు చేశారు.కుష్టురోగుల కోసం సెంటర్‌ని ఏర్పాటు చేశారు. క్రమంగా దానికి సంబంధించిన సెంటర్లను పాకి స్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. 

ఆమే స్వయంగా డాక్టర్లకు శిక్షణ ఇస్తారు. ఏ సమయంలో ఎలా మసలుకోవాలో వంటివన్నీ నేర్పుతారు.ఆమె చేస్తున్న సేవకు ప్రభుత్వం కూ డా కదిలింది. 1968లో జాతీయ కార్యక్రమాన్ని కుష్టురోగుల కోసం ప్రారంభించింది. వ్యాధిని అదుపు చేసేందుకు ప్రయత్నించింది. యాభై ఏళ్ళ క్రితం అన్ని ప్రాంతాల్లోనూ కుష్ఠు రోగుల కాలనీలు వుండేవి. కానీ ఈ కార్యక్రమం అనంతరం అది పదివేలలో 0.27 మంది మా త్రమే వాటిలో నివసిస్తున్నారు.

ప్రకృతి విలయంలోనూ...
2000 సంవత్సరంలో బెలూచిస్తాన్‌లో వర దలు, 2005 భూకంపం, 2009 వరదలు ఇలా ఆ దేశాన్ని అతలాకుతలం చేసిన ప్రతి సా రి ఆమె అక్కడి ప్రజలను అక్కున చేర్చుకున్నా రు. వీటి వల్ల మొత్తం 21 మిలియన్‌ ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా సింధ్‌ ప్రాంతంలో ఒక మిలియన్‌కు పైగా ప్రజలు వాటి వల్ల నష్ట పోయారు.దీంతో ఆమె దినచర్యలో ఆ ప్రాంతం ఒకటిగా మారిపో యింది. నిత్యం అక్కడికి వెళ్లి వారి బాగోగులు, తిండి, బట్ట, వసతులు వంటివన్నీ ఆమె స్వయంగా చూసుకున్నారు.‘ఆమెకు ఇప్పటికీ ఎంతో శక్తి వుంది. ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి’ అని సిస్టర్‌ ఫా చారిటీ కో ఆర్డినేటర్‌గా పని చేస్తున్న వేణుగోపాల్‌ చెబుతున్నారు. 

సింధ్‌ ప్రాంతంలో...
సింధ్‌ ప్రాంతంలోని తట్టా జిల్లాలో ఆమె చేసిన సేవలు ఎన్నటికీ మరువలేరు. ఈ జర్మన్‌ నన్‌ని ఒక తల్లిలా అక్కడి వారంతా భావిస్తున్నారు. ‘మేము అంతా పోగొట్టుకున్నాం. కానీ అమ్మ మాకు సాయం చేస్తుంది.మాకు రక్షణగా ఆమె వుంది’ అని సన్వాల్‌జోగి అనే పాములు పట్టు కునే వ్యక్తి చెబుతున్నాడు.‘ఆమెకు ఎంతో రుణపడి వున్నాం. నా పొలాన్ని మొత్తం పోగొట్టుకున్నాను. పంట నాశనం అయిపోయింది. ఎవరూ సాయం చేయలేదు.అమ్మ ఇచ్చిన నూనె గింజలనే ఇప్పుడు వ్యవసా యానికి వాడుతున్నాను. ఇక ఎవ్వరి నుండి ఏమీ అందలేదు’ అని కేసర్‌కు చెందిన ఓ రైతు చెబుతున్నాడు.

ఆమె వారికి ఎంతగానో సాయం చేసింది. వారికి అండగా వుండేందుకు అన్నీ కల్పించింది. ఇళ్ళ ను తిరిగి కట్టుకునేందుకు సాయం చేసింది. పాలలను సాగు చేసుకునేందుకు అవసరమైనవి అందించింది. ‘కేవలం కుష్టు రోగుల కోసం మాత్రమే కాదు.అంధులకు, క్షయ వ్యాధి గ్రస్తులకు కూడా సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. సిస్టర్‌ ఫా ఎంతో మందిని సాయం అర్థిస్తోంది. తన సేవలను ఇంకా మరింత మందికి అందించేందుకు ఆమె కష్టపడుతోంది.’ అని గోపాల్‌ చెబుతున్నారు. ‘మధర్‌ థెరిస్సా వంటి గొప్ప వ్యక్తితో మరొకరిని పోల్చడం సరికాదు. కానీ మేము మాత్రం సిస్టర్‌ ఫాను మథర్‌ థెరిస్సాగానే పిలుచుకుంటాం.భారతదేశంలో మథర్‌ ఎలాంటి సేవ చేసిందో పాకిస్తాన్‌లో మాకు సిస్టర్‌ కూడా అలాగే చేసింది. చేస్తోంది కూడా’ అని సింధ్‌ ఆరోగ్య శాఖ మంత్రి సాఘీర్‌ అహ్మద్‌ చెబుతున్నారు.
-హైమ సింగతల 
surya telugu daily, January 10, 2011

No comments:

Post a Comment