Search This Blog

Sunday 10 August 2014

వైకల్యాన్ని జయించిన స్ర్తీ శక్తి పద్మప్రియ

‘స్ర్తీ శక్తి స్వరూపం’ అని నిరూపించింది ఆమె. స్వయంకృషితోకళాకారిణిగా, కళాపోషకురాలిగా..వున్నతంగా ఎదిగి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది.. నిరంతరం శ్రమించడమే ఎదుగుదలకు కారణం అని అంటోంది. అంగవైకల్యాన్ని చూసి కుంగిపోకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న పద్మావతి.. కళాప్రియుల మదిలో పద్మప్రియగా నిలిచిపోయిన ధీరవనిత.. స్ర్తీశక్త (రాణిలక్ష్మీబాయి, క్రియేటివ్‌ డిజేబుల్డ్‌గా ఎన్నో అవార్డులను అందుకున్నా ఇంకాచేయాల్సింది చాలా వుంది అంటూ ధీరతో చెబుతున్న జీవిత కథనం..

padmaఅన్నిటికన్నా అందరికన్నా ముందుగా చెప్పాల్సింది నా కుటుంబం గురించి. ఈ రోజు ఈ స్థాయిలో వున్నానంటే అంతా మా అమ్మ చలవే. నాకు వచ్చిన ఈ వైకల్యాన్ని చూసి ఆమె ఏడవని రోజంటూ లేదు. ఎన్నో కష్టాలు పడింది. నా కోసం వున్న వూరిని వదిలేసి వచ్చేసింది. ఇక తమ్ముడు, అక్క అందరూ అడుగడుగునా నన్ను వెన్నంటి నడిపించినవారే.నాకు కాళ్లు లేవన్న సంగతి నాకు ఎప్పుడూ గుర్తురాకూ డదని ఎంతో తాపత్రయపడతారు. ప్రతి కార్యక్రమానికి నన్ను వెంటబెట్టుకుని తీసుకెళతారు.ఇప్పుడు నా కొడుకు కూడా నాకు సాయం చేస్తున్నాడు. వాడి వయసు ఆరేళ్లు. కానీ ప్రతి చిన్న దానికి నేనున్నాను అంటూ నాకోసం ఏదైనా అందించేందుకు, తినిపించేందుకు వస్తాడు.

వైకల్యం అంటే తెలియని వయసులో...
అసలు ఏమీ తెలియని వయసు. నాకు ఇంకా ఒక సంవత్సరం పూర్తి కాకముందే పోలియో వచ్చింది.ఆరు సంవత్సరాల పాటు పడుకోవడం తప్ప ఇంకోటి తెలియదు. నా శరీర భాగాలు దాదాపు 90 శాతం పని చేయలేదట. అన్నీ మంచం మీదే. నేను కనీసం లేచి నడవలే పోతున్నాను అని మాత్రం అర్థం అయ్యేది.

ఎనిమిదేళ్ల కాలం.. 7 శస్త్ర చికిత్సలు... 
చిన్నతనంలో అమ్మ దగ్గరే చదువుకున్నాను. ఏడేళ్ల వయసులో వున్నప్పుడు నన్ను సెయింట్‌ మేరీ పోలియో రీహాబిలిటేషన్‌ సెంటర్లో చేర్పించారు. నా జీవితంలో మర్చిపోలేని ఒక ముఖ్యమైన భాగం అది.నేను ఏదై నా చేయగలను అన్న నమ్మకం కలిగింది అక్కడే. మొత్తం ఎనిమిది సంవత్సరాల పాటు నాకు ఏడు శస్త్ర చికిత్సలు చేశారు. అది మొత్తం ఆ సెంటరే భరించింది. అక్కడే నాకు నా మొదటి గురువు, నాకు జీవితం గురించి తెలి యజేసిన అమ్మ క్లారా హెలెన్‌. నేను ఇప్పుడు ఈ స్థాయిలో వున్నాను అంటే అది ఆమె చేసిన సాయమే. చనిపోయిన తరువాత కూడా నాకు ఎటువంటి సమస్యలూ రాకుండా వుండేందుకు ఏర్పాటు చేశారు. 

విద్యాభ్యాసం.. కళల పట్ల మక్కువ...
padma1విద్యాభ్యాసం అంటే నేను బిఏ చదివాను. పిజిడిసిఏ చేశాను.ఇంకా కొన్ని కంప్యూటర్‌ కోర్సులు చేశాను.ఆరవ తరగతి చదువుతున్నప్పుడు నా మొదటి నాటిక పాత్ర వేశాను. అందులో మేరీమాతగా చేశాను. అప్పటి నుండి ఎన్నో డ్రామాలలో చేశాను. ప్రత్యేకంగా మాకు సంగీతం నేర్పించడం కోసమే ఇద్దరు మాస్టర్లు వుండేవారు. నా మొదటి గురువు కె.వి.సుబ్బారావు వద్ద సంగీతాన్ని నేర్చుకున్నాను. పృథ్వీ వెం కటేశ్వరరావు వద్ద మ్యూజికల్‌ డ్రామా నేర్చుకున్నాను.ఇవన్నీ మైథాలజీలో భాగంగా మాకు నేర్పేవారు. దానితోపాటే పాటలు పాడటం కూడా చేసే దాన్ని. ఇక కళాశాలకు వచ్చిన తరువాత ఆసక్తి మరింత పెరి గింది. మరింత పట్టుదలతో సాధన చేయడం ప్రారంభించాను. 

నా ఎదుగుదలకు పునాది వంశీ ఆర్ట్స్‌ థియేటర్‌..
1993లో మొదటి సారి హైదరాబాదుకు వచ్చాను. ఆ రోజు మహాశివరాత్రి పండుగ. వంశీ థియేటర్‌ ఆర్ట్స్‌ వారు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాట పాడాను. దాని స్థాపకులు వంశీ రామరాజుగారికి నా పాట ఎంతో నచ్చింది. మంచి భవిష్యత్తు వుందంటూ ప్రోత్సహించారు. ఆయన కార్యక్రమాల్లో అవకా శాలు ఇస్తానని చెప్పారు. ఇక ఆయన ఇక్కడే హాస్టల్‌లో వుండమని కోరారు. ఆయన నాకు మంచి భవి ష్యత్తు వుందని ఆశీర్వదించారు. ఆయన పక్కన నారాయణరెడ్డిగారు కూడా వున్నారు. వంశీ గారి సహకారంతోనే వై.రామచంద్రర్‌ వద్ద కర్నాటక సంగీతాన్ని నేర్చుకున్నాను. 

తెలుగు సినిమా సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌గా...
padma2సెన్సార్‌ బోర్డు మెంబరుగా చేరినప్పటి నుండి ఇప్పటి వరకు నా బాధ్యతలు నేను నిర్వర్తించాను. అక్కడ అందరూ ఎంతో సహకారం అందించేవారే.అలాగే నా వరకు నేను అస భ్యతను, వ్యక్తిగతంగా కించపరచడాలు వంటివి వుంటే మాత్రం ధైర్యంగా వాటికి తొలగించేస్తాను. 

బాధించిన అంశాలు... ఇబ్బందులు..
బాధించిన అంశాలు అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. ఇంత గుర్తింపు అయితే వచ్చింది కానీ.. ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం అందలేదు. ఆర్థికంగా ఆదుకోనూ లేదు. వికలాంగులకు ఇచ్చే పించను రూ.500లు తప్ప ఇంకేమీ చేయలేదు. ఇంత కష్టపడ్డా నాకు ప్రభుత్వ ఉద్యోగం లేదనే బాధ మనసును తొలు స్తూ వుంటుంది. ఇక వైకల్యం వల్ల అంటే నాలోని పట్టుదలను గమనించకుండా నేను కష్టపడటం చూసి చాలామంది ఎందుకు అంత కష్ట పడటం అని అనేవారు. కొన్ని సార్లు మాత్రం చాలా బాధ అనిపించేది. కానీ కష్టపడితేనే ఫలితం.. అది నాకు తెలుసు.. అలానే ముందుకెళ్తున్నాను. 

పద్మావతి ఫౌండేషన్‌ ఏర్పాటుకు స్ఫూర్తి.. 
నేను ఒక బాధితురాలిని. నాలా ఎంతో మందిని చూశాను. వారి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చిన్న తనం నుండి వుండేది. కానీ ఆర్థికంగా నేను ఆ స్థాయికి ఇంకా ఎదగలేదు. కానీ ఏదో విధంగా నాలాం టి వారికి సేవ చేయాలనే ఉదే్దశంతోనే ‘పద్మావతి ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిజేబుల్డ్‌’ను ఏర్పాటు చేశాను.దీని ద్వారా వికలాం గులకు టైలరింగ్‌, కంప్యూటర్‌, మెడికల్‌ క్యాం ప్స్‌ వంటివి నిర్వహిస్తున్నాను. 

జీవితంలో మర్చిపోలేని వ్యక్తులు... 
padma3ఇప్పటికీ నాకు నెల నెలా ఆర్థిక సాయాన్ని అందిస్తూ నాకు సొంత అన్న కన్నా ఎక్కు వగా చూసుకుంటున్నది పోలియో రీహాబి లిటేషన్‌ నిర్వాహకురాలు క్లారా హెలెన్‌ కొడుకు ఎరిన్‌. ఆయన ఆస్ట్రేలియన్‌. నెల నెలా నాకు డబ్బులు పంపుతారు. 

అందుకున్న అవార్డులు ఇచ్చిన ఆనందం...
ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు అందు కున్నా రాష్టప్రతి చేతుల మీదుగా అందుకు న్న అవార్డు మాత్రం నా జీవితంలో మర్చిపో లేనిది. 2009 సంవత్సరం వికలాంగుల లో బెస్ట్‌ క్రియేటివ్‌గా ఢిల్లీలో ఆ అవార్డు అందు కున్నాను. 2010లో స్ర్తీ శక్తి(రాణిలక్ష్మీ బాయి) అవార్డు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కానీ రాష్ట్రం నుండి ఎటువంటి ప్రోత్సా హకాలు పొందలే పోయాను. 



ఆశయం... భవిష్యత్తు ప్రణాళిక...
రాజకీయంగా వికలాంగులు ఎదగాలి. దాని కోసం ఎంతైనా ఉద్యమిస్తాం. నేను ఓడిపో తానని తెలిసినా 2007లో ఎమ్మెల్సీగా పోటీ చేశాను. రాజకీయంగా వికలాంగులూ ముందుండాలనే లక్ష్యంతోనే ఇది చేశాను.ఇక భవిష్యత్తులో అంటే ఇప్పుడే ఏమీ చెప్పలేను. నాలాంటి వారికి సాయపడటమే ఇపుడునా ముందున్న కర్తవ్యం. 

తెలుగు భాషకు మాత్రమే సొంతమైన పద్యనాటి...
పద్య నాటకాల పట్ల ఆసక్తి పెరిగింది మాత్రం సి.నారాయణ రెడ్డి వల్లే. నాటి కలంతా డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి చలవే. దగ్గరుండి మరీ నాకు పద్యాన్ని నేర్పించారు. అది నా అదృష్టం. నేను వేసిన సత్యభామ పాత్రకు తిరుగు లేకుండా పోయింది. నేను వేసిన సత్య నాటకం చూసి జమునగారు గుండె లకు హత్తుకున్నారు. ‘సత్య అంటే నువ్వే’ అన్నారు. ఆమె సత్యభామ పా త్రలు వేసినప్పటి ఆభరణాలు, వస్త్రాలను నాకు కానుకగా ఇచ్చారు. ముఖ్యంగా ఐదు పాత్రలు మాత్రం మర్చిపోలేనివి శ్రీకృష్ణ, సత్య భామ, వెంకటేశ్వర, పాండురంగ, శ్రీనివాసునిగా... మొత్తం 300 ల వరకు పద్యనాటికలు వేశాను. 


- హైమ సింగతల
(సూర్య దినపత్రిక  March 20, 2011)

No comments:

Post a Comment