Search This Blog

Sunday 10 August 2014

జాతి మనుగడ కోసం అగ్విండా న్యాయ పోరాటం...

అనుభవించిన కష్టాలు.. నష్టాలే మనిషికి కొత్త పాఠాలను నేర్పుతాయి. పెద్ద పెద్ద చదువులు లేకపోయినా.. చట్టాలు తెలియకపోయినా పోరాడేందుకు ప్రోత్సహిస్తాయి. అందుకు వుండాల్సింది ఒక్కటే సంకల్పం... వయసుతో నిమిత్తం లేదు... సమయంతో పనిలేదు.. మదిలో ఒకటే లక్ష్యం.. దశాబ్దాలుగా చేస్తున్న యుద్ధం.. తమ జాతిని కాపాడేందుకు ఓ నిరక్షరాస్యురాలైన ఓ మహిళ చేసిన న్యాయ పోరాటం.. చివరికి విజయం ఆమెదే. న్యాయస్థానం తీర్పు ఆమె వైపే.. అగ్రరాజ్యానికి చెందిన ఓ బడా వ్యాపార సంస్థతో తలపడి సాధించిన విజయం అది.. తమ జాతికి జరిగిన నష్టానికి.. భావితరాల రక్షణకు చేసిన శాస్తి.. అయినా ఆమెకు తృప్తి లేదు. న్యాయ స్థానం తీర్పుతో సంతృప్తి లేదు. అది పూర్తిగా అమలయ్యి తిరిగి తమ ఇల్లు(తమ నివాస ప్రాంతం) మామూలు స్థితికి వస్తేనే మనశ్శాంతి. అప్పటి వరకు లేదు విశ్రాంతి ఆమెకు. క్విటో మహిళ అగ్విండా ప్రెటో వ్యాపార దిగ్గజం టెక్సాకో, చెవ్రోన్‌పై పోరాడి గెలిచిన కథనం..

agvindaక్విటోలో ఎక్కువగా మాట్లాడే భాష స్పానిష్‌. ఆ భాష కూడా మారి యా అగ్విండాకు రాదు. తన భావాలను వ్యక్త పరచాలంటే ఆ మెకు ఎవరో ఒకరు తోడుండాలి. మాటలను అనువదించి వివరించా లి. ఏం చెప్పాలన్నా ఇదే పరిస్థితి. నిరక్షరాస్యురాలు. ఓ మారుమూల గ్రామీణ ప్రాంతం.. ఎన్నడూ బయటికి వచ్చినది కూడా లేదు. ఇల్లు కుటుంబం, వేట ఇవే ఆమెకు తెలిసినవి... అది కొన్నేళ్ల క్రితం వరకు. ఇప్పుడు అక్కడి స్యాయస్థానం ఇచ్చిన ఓ చారిత్మక తీర్పులో కీలక భా గస్వామి ఆమె. 

అమెరికాకు చెందిన అతి పెద్ద పెట్రోలు వ్యాపార సం స్థపై పర్యావరణ నష్ట పరిహారం కోరుతూ చేసిన పోరాటంలో కీలక పాత్ర పోషించింది. తమ ఇంటిగా భావించే రెయిన్‌ ఫారెస్ట్‌ను నాశ నం చేసిన చెవ్రోన్‌పై వేటు వేసేలా చేసింది.చెవ్రోన్‌ పెట్రో కంపెనీ చేసిన వినాశనానికి ఇటీవల అక్కడి న్యాయస్థా నం చారిత్రక తీర్పును ఇచ్చింది. ఇప్పటి వరకు ఎవరూ విధించనంత మొత్తాన్ని నష్టపరిహారంగా విధించింది. మొత్తం 9.5 బిలియన్ల డాల ర్లను నష్టపరిహారంగా చెల్లించాలి. అక్కడి ప్రాంతాన్ని తిరిగి పునరు ద్ధరించాలి అని తీర్పు నిచ్చింది. 

కాలుష్యం కార్ఖనాగా.. 
oil-fireమారియా అగ్విండా ఉంటున్న నివాస ప్రాంతం పచ్చని చెట్లతో.. నదులు, చెరువులతో కళకళలాడేది. వేటాడటం, చేపలు పట్టడం, ఆహార సేకరణ వారి జీవనాధారం. 30 వేల కుటుంబాలు అక్కడ వుండేవి. కానీ గత మూడు దశాబ్దాలుగా అక్కడి వాతావరణం విష తుల్యంగా మారిపోయింది.. తాగే నీరు, తినే తిండి అన్నీ కలుషితం.. బతకడమే కష్టంగా మారిపోయింది.అక్కడ ఏర్పాటు చేసిన ఓ బడా పెట్రోలు వ్యాపార సంస్థ అడవిలోకి వ్యర్థపదార్థాలను విడుదల చేయడం ప్రారంభించింది. వాటి వ్యర్థాలు, రసాయన పదార్థాలు అన్నీ ప్రాంతాన్నంతా నాశనం చేసేశాయి. దీని కి సంబంధించి ఎప్పుడో వేసిన డేవిడ్‌-గోలియత్‌ కేసులో తీర్పు వెలు వడి ఎంతోకాలం అయింది. అయినా దానికి సంబంధించిన నష్ట పరి హారం మాత్రం ఇప్పటి వరకు అందలేదు.‘నేను చనిపోయేలోపే ఇక్కడి ప్రాంతం బాగు పడటం నేను చూడాలి. నా పశువులు చనిపోయాయి. అలాగే చుట్టు పక్కల మొత్తం నాశనం అయిపోయింది. గాలి కూడా కలుషితమైంది. దీనికి కోర్టు తీర్పు ఇ చ్చింది కానీ ఇంకా దానికి సంబంధించిన అమలు కార్యక్రమం మొద లు కాలేదు’ అని 61 ఏళ్ళ అగ్విండా చెబుతోంది. 

30 ఏళ్ళుగా జరుగుతున్న నష్టం.. 
రూమిపంబా ప్రాంతంలోని అగ్విండా ఇంటికి సమీపంలో ఒరెల్లానా ప్రావిన్స్‌ గురించి చెబుతూ ‘30 సంవత్సరాలుగా ఆయిల్‌ డ్రిల్లింగ్‌ చే స్తున్నారు. వాటి నుండి వస్తున్న వ్యర్థపదార్థాలన్నీ ఇక్కడే వదిలేస్తున్నా రు. దీని వల్ల మేము ఎంతో నష్టపోయాం. ఇంకా నష్టపోతూనే వు న్నాం’ అంది. 

సంస్థ చరిత్ర..
aguindaaటెక్సాకో కంపెనీ 1964-1990లలో ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకు న్నది. అప్పటి నుండి అక్కడ పెట్రోలు వెలికితీత పనులు చేశారు. 2001లో అమెరికన్‌ వ్యాపార దిగ్గజం చెవ్‌రోన్‌ దీన్ని సొంతం చేసుకు న్నది. పెట్రోలియం బావి 1970 నాటిది. ఇంకా అక్కడ పెట్రోలు డ్రి ల్లింగ్‌ జరుగుతూనే వుంది. అది మొదలు అగ్విండా అన్ని సంఘట నలకు సాక్షిగా వుంది. 1993లో ఆ ప్రాంతంలో 30వేల కుటుంబా లు నివసించేవి. ఇంకా సుకంబియోస్‌ పరిసర ప్రాంతాల్లోనూ అనేక తెగలు నివసించేవి. ఇప్పుడు అక్కడ మిగిలింది అంతా టెక్సాకో వది లి పెట్టిన వ్యర్థపదార్థాలు.. క్రూడ్‌ ఆయిల్‌.. కలుషిత నీరు.. మాత్ర మే. నదులు పూర్తిగా మురికికూపాలుగా మారిపోయాయి. చెరువు లు అన్నీ కలుషితం అయిపోయాయి. గాలి కూడా కాలుష్యంతో నిం డిపోయింది. వీటన్నిటి కారణంగా అక్కడి తెగ వారు క్యాన్సర్‌ బాధితు లుగా మారుతున్నారు. ఇప్పటి వరకు అనేక మంది మృత్యు వాత పడ్డారు. కానీ ఆ వివరాలను మాత్రం కంపెనీ బయటకు రానివ్వలేదు. 

అంతరించిపోతున్న తెగ
తన భర్త, ఇద్దరి పిల్లల మృతికి కారణం పర్యావరణ కాలు ష్యమే అని అగ్విండా నమ్ముతోంది. అక్కడ ఏన్నో పరిశోధన లు, పరిశీలను చేసిన అమెజాన్‌ వాచ్‌ కూడా ధృవీకరిం చింది. అమెరికాలోని రోడ్‌ ఐలాండ్‌ (ఓ రాష్ట్రం) అంత వుం డే ఈ ప్రాంతం మొత్తం కలుషితం అయిపోయిందని తేల్చిం ది. ఇంకా అక్కడి ప్రజలు ఎన్నో చర్మ సంబంధిత వ్యాధుల కు ఇదే కారణం అవుతోంది. తన మనవరాలి కాలిని చూపి స్తూ..‘చర్మ సంబంధిత వ్యాధులు, ఫంగస్‌ లాంటి వాటితో మేమంతా బాధపడుతున్నాం. చిన్నపిల్లలకంతా ఇదే బాధ’ అని అగ్విండా చెప్పింది. 

తప్పించుకునే మార్గంలో చెవ్రోన్‌..
చెవ్‌రోన్‌ తాను నిర్వహిస్తున్న పెట్రోల్‌ బావికి సంబంధించి కొత్త వాదనలు వినిపించింది. రాష్ట్ర సంస్థ అయిన పెట్రో ఎడ్యుకేడర్‌ని ఇందుకు కారణంగా చూపుతోంది. 1972లో టెక్సాకో చేసుకున్న ఒప్పందం ప్రకారం పరిసరాలను శు భ్రం చేయడం, వ్యర్థాలను తొలగించడం వంటి నిబంధన లు లేవని చెప్పింది. వీటిని ముందుగానే తెలియజేసినట్లు, అది నిబంధనల్లో వున్నట్లు చూపింది. ఈ విధానం 1992 వరకు కొనసాగింది అని కూడా తెలిపింది. 

ఎన్నో ప్రమాదాలకు నిలయం...
దక్షిణ ఆకాలో 200 మీటర్లు విశాలమైన పెట్రోలు బావి వుంది. ఇది రూపాంబాకు 656 అడుగులు దగ్గరలో వుంది. పెట్రోలు బావి పక్క న ఏర్పాటుచేసిన స్టోరేజ్‌ ట్యాంక్‌ పొంగి ప్రవహించడం వల్ల వేల గాల న్ల ప్రెటోలు, క్రూడ్‌ ఆయిల్‌ వంటివి నదిలో కలిశాయి. వ్యర్థాలన్నీ భూమి మీద పరుచుకుపోయాయి. 1987-1990లో ఇలా చాలా సార్లు జరిగింది. 

canoe-cofanదానికి చర్యలు చేపట్టినా అవి ఏ మాత్రం సరిపోలే దు. తరువాత టెక్సాకో అక్కడ మరమత్తుల పనులను 1990లో చేసింది. కానీ ఎక్కడిది అక్కడే నిలిచిపోయింది. ఇక దాన్ని బాగుచే యకుండా వదిలేశారు. కానీ పెట్రోలు వెలికితీత పనులు మాత్రం ఆగ లేదు. ఆరు నెలల క్రితం పెట్రోఎడ్యుకేడర్‌కి సంబంధించి ఓ పన్నెండు మంది పనివాళ్లు అక్కడి వ్యర్థాలను తొలగించే పనుల్లో నిమగ్నమ య్యారు. కొద్ది కొద్దిగా వాటిని బాగు చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో చేయాలంటే మాత్రం అది ఇంకా చాలా కాలం పడుతుంది.

ఊహించని నష్టం.. 
‘టెక్సాకో వచ్చినప్పుడు ఇంత నష్టం జరుగుతుందని అనుకోలేదు. అనుకుని వుంటే అప్పుడే దాన్ని వెనక్కి పంపే వాళ్లం. మొదట్లో అలాగే వదిలేశారు. తరువాత ఒక బావిని తవ్వి అక్కడే వ్యర్థాలను కాల్చేయ డం ప్రారంభించారు. అది కూడా వదిలేశారు’ అని అని విలియం, అ గ్విండా కొడుకు ఆమె మాటలను అనువదించి చెబుతున్నారు. ‘ఇది మా జీవితాలను మార్చేసింది. వేటాడటం, చేపలు పట్టడం, ఇక ఇతర ఆహార సేకరణా మార్గాలపై ప్రభావం చూపింది. అన్నీ నాశనం అయి పోయాయి. అంతా కోల్పోయాం. ఏమీ మిగలదలేదు’ అని చెబుతున్నాడు. 

కర్రలతో కప్పేశారు.. 
woman_surgery_scars‘కంపెనీ నష్టపరిహార చర్యలు చేపట్టింది. కానీ అవన్నీ పైపైనే. కర్రల సాయంతో భూమిని, ఇతర ప్రాంతాలను కప్పడం ప్రారంభించారు. కింద వున్న మురికిని శుభ్రం చేయడం లేదు’ అని టెక్సాకో వల్ల నష్ట పోయిన వారిలో ఒకరైన గ్రెఫా చెబుతోంది. అక్కడి 30 వేల మందికి ప్రతినిధిగా ఆమె తన గొంతును వినిపిస్తోంది..ఇప్పుడు అక్కడ చేపట్టిన కొన్ని పనుల వల్ల కొద్దివరకు మార్పు వచ్చిం ది అని అగ్విందా చెబుతోంది. ‘శుభ్రం చేసే పనులు టెక్సాకో వదిలేసిం ది. గాలి కూడా విషతుల్యంగా వుంది. ఇక దీనిపై బతకలేం’ అని ఆమె బాధను వ్యక్తం చేస్తోంది. ‘ఎవరైనా టెక్సాకో తరపు నుండి ఇక్కడికి వస్తే వారి కళ్లలో కారం కొడతాను’ అని ఆమె అంటోంది. 

ప్రస్తుతం రూమి పంబా..
రూమిపాంబాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఘాటైన పెట్రోలియం వాసన. ప్రస్తుతం అక్కడి నుండి ఎంతో మంది వలసలు వెళ్ళిపోయా రు. వున్నవారు వ్యాధులతో నరకం అనుభవిస్తున్నారు. 

న్యాయమైన తీర్పు...
చెవ్రోన్‌పై అక్కడి ప్రజలు కొన్ని ఏళ్లుగా పోరాటం చేశారు. గత వారం లో కోర్టు చెవ్రోన్‌కి వ్యతిరేకంగా తీర్పు నిచ్చింది. 8.6 బిలియన్‌ డాల ర్లు నష్టపరిహారం, మేనేజ్‌మెంట్‌ పది శాతం వాతావరణ పరిరక్షణకు కేటాయించాలని చెప్పింది. అక్కడి స్థానికులు కూడా తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతున్నారు. దీనిపై 27 బిలియన్‌ డాలర్లు చెల్లించాలని పోరాడేందుకు సిద్ధం అవుతున్నారు. 

- హైమ సింగతల
(సూర్య దినపత్రిక March 5, 2011)

No comments:

Post a Comment