Search This Blog

Monday 11 August 2014

చిన్న చిన్న పిల్లలు... పెద్ద పెద్ద బొమ్మలు

చిన్నపిల్లలకి బొమ్మలంటే భలే ఇష్టం. వాటితో చాలా ఇష్టంగా ఆడుకుంటారు.అమ్మపాలు, మట్టి, తరువాత పిల్లలు ఎక్కువగా ప్రేమను చూపించేది బొమ్మలపైనే. అందుకే ప్రపంచంలో బొమ్మల మార్కెట్‌కి అంత క్రేజ్‌. అయితే ఈ క్రేజ్‌ మరికొద్ది రోజుల్లోనే అంతరించిపోతుందని ఓ పరిశోధనలో తేలింది.

childrenప్రస్తుత తరం పిల్లలకి టీవీలోని కార్టూన్‌ బొమ్మలంటే మోజు. టెలివిజన్‌లో ప్రసారమయ్యే చిన్నపిల్లల కార్యక్రమాలను 24 గంటలు కళ్లార్పకుండా చూసేస్తారు.అలాంటప్పుడు వాళ్లకి బొమ్మ లతో ఏం పని! ఇప్పటి చిన్నపిల్లల పరిస్థితి ఇలా ఉంటే ఇక రాబోయే తరంలోని పిల్లలు ఎలా ఉంటారనేనా మీ డౌట్‌! అమ్మో వాళ్ల గురించి ఆలోచిస్తేనే మనకు మైండ్‌బ్లాక్‌ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. బొమ్మలతో చెప్పే బుజ్జికథలు, వాటితో చేసే అల్లరిపనులకు బదులుగా.. 

హలో.. ఓహో.. ఆల్‌రైట్‌.. నోవే.. ఒకే.. బైబై... ఈ మాటతో గర్ల్‌ఫ్రెండ్స్‌తో చిట్‌చాట్‌ చేస్తుంటారు. ఇప్పటికే మన ఇంట్లో చాలా మంది చిన్నపిల్లలకు మొబైల్స్‌ని ఇచ్చి వాటితో ఆడుకోమనటం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు బలపం, చాక్లెట్‌, బిస్కట్‌ని కావాలనే అడిగే పిల్లలు ఇప్పుడు వాటికి బదులుగా సెల్‌ఫోనో... కంప్యూటరో అడుగుతున్నారు. అవి ఇవ్వకపోతేనే ఏడుపు మొదలుపెడుతున్నారు.చిన్నపిల్లల కోరికల్ని బాగా అర్థం చేసుకున్న కొన్ని కంపెనీలు వాళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని మొబైల్స్‌ని కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. అయితే అవి నిజమైనవి కావు. వీటికి ఆదరణ మొద ట్లో ఎక్కువగా వున్న... ప్రస్తుతం వీటికి కాలం చెల్లిపోయింది. దానికి కారణం తల్లిదండ్రులేనని పేర్కొన్నారు పరిశోధకులు.చిన్నపిల్లలకు స్వయంగా ఆలోచించే శక్తి రానంతవరకు వారిపై ప్రేమ చూపించే వాళ్ల మాటల్నే వింటారు.వాళ్లు ఏది చెపితే అదే చేస్తారు. ఎలా ఉండమంటే అలానే నడుచుకుంటారు. పిల్లలు ఎదిగేక్రమంలో జరిగే ఈ పరిణామం చిన్నపిల్లల మనస్తత్వంపై బాగా ప్రభావాన్ని చూపుతుంది. 

previewఅయితే మొదట్లో వాళ్లు తల్లిదండ్రుల మాటవిన్నా వారికంటూ ఒక వయసు వచ్చిన తరవాత వారికి స్వయంనిర్ణయాలు తీసు కునే శక్తి వస్తుంది. అప్పుడు వాళ్లు ఎవ్వరిమాట వినరు. వాళ్లకు నచ్చింది చేసేస్తుంటారు. అందుకే చిన్నపిల్లలకు ఆలోచనాశక్తి వచ్చే వయసులో వారి ని సరియైన మార్గంలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులదే. మొబైల్స్‌లో రేడియో థార్మిక శక్తి ఎక్కువ. అంతేనా వాటిని ఎక్కువగా వాడటం వల్ల కొన్నిరకాలైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లలు పాటలు వింటారని, మాట్లాడతారని తల్లిదండ్రులు ముచ్చటపడిపోయి మొబైల్‌ను వారి చేతిలో ఎక్కువ సేపు ఉంచకపోవడం ఎంతైనా మంచిది.పెద్దలకే ఇది హాని కలిగించగలదని అంటున్న నేపథ్యంలో పిల్లలకి అది ఎంత హాని కలిగిస్తుందో ఆలోచించాలి. మొబైల్స్‌ని చిన్నతనంలోనే పిల్లలు వాడితే వారికి మెదడు సంబంధిత రోగాలతో పాటూ...ఆలోచనాశక్తి కూడా నశించేపోయే అవకాశమున్నదని చిన్నపిల్లల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్త! 
-హైమ సింగతల
surya telugu daily

No comments:

Post a Comment