Search This Blog

Thursday 14 August 2014

అద్దెకు అమ్మ..!

mamy1నవమాసాలు.. కడుపులో దాచుకుని.. జాగ్రత్తగా కాపాడుకుని.. కన్నబిడ్డని ఇతరులకు అప్పజెప్పేందుకు ఏ తల్లి మనసు ఒప్పుకుంటుంది? ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. అలా ముగ్గురు పిల్లలను కన్న వెంటనే కనీసం చూడకుండానే అప్పగిచ్చేసింది ఆమె. మరో బిడ్డకు జన్మనిచ్చినా అలాగే చేస్తానంటుంది. వినేందుకు చాలా ఆశ్చర్యంగా వున్నా.. ఇది నీలం చౌహాన్‌ నిజజీవిత గాధ.. తన ఇద్దరు బిడ్డలను పెంచి.. పోషించేందుకు మరో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. అందుకు ఆమె చెప్తున్న కారణాలు..

సరోగేట్‌ మదర్‌ (గర్భాన్ని అద్దెకిచ్చే తల్లి).. పిల్లలు లేని వారికి ఈ మాట ఓ మంత్రం... వరం... ఇక పిల్లలు పుట్టరు అని బాధపడుతున్న తరుణంలో చల్లని కబురు.. కానీ ఇది ఓ వైపు మాత్రమే.. అలా పిల్లలు లేని తల్లి దండ్రులకు ఓ బిడ్డను కని ఇచ్చేందుకు ముందుకు వచ్చే మహిళల పరి స్థితి పూర్తి భిన్నం. ఇటు సమాజం.. అటు అయినవారు ఎవరూ అర్థం చేసుకోలేని స్థితి. అవసరం కోసం ఈ విధంగా చేసినా వారి కంటూ కొన్ని కష్టాలు.. నష్టాలు అను భవించక తప్పదు..

కష్టాలను దాటేందుకు..
ఢిల్లీకి చెందిన నీలం చౌహాన్‌ తొమ్మిదవ తరగతి వరకు చదువుకుంది. మలేరియా.. తరువాత టైఫాయిడ్‌ రావడంతో అనారోగ్యం పాలై చదువు మానుకుంది. పదవ తరగతి పరీక్షలు రాయకుండానే అక్కడితో ఆపేసిం ది. వయసు రావడంతో ఆమెకు వివాహం చేశారు. పెళె్ళైన మూడేళ్ళలో ఇద్దరు బిడ్దలకు తల్లైంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతుకున్న వారి జీవితంలో అనుకోని ఒడిదుడుకులు.. తన భర్త మరో మహిళను వివా హం చేసుకోబోతున్నాడని తెలుసుకుంది. అప్పటికి ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆరు నెలల కాలంలోనే ఆ పాప కూడా అనారోగ్యం పాలై చనిపోయింది. దీంతో చేసేది లేక విడాకుల కోసం కోర్టును ఆశ్రయిం చింది.

పిల్లల సంరక్షణ కోసం నెలకు రూ.2,500 చెల్లించేలా కోర్టు తీర్పునిచ్చిం ది. ఇద్దరు పిల్లలతో నీలం ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. కూలీ.. నాలీ చేసుకుని బతుకుతున్న సమయంలో ఓ వార్తా పత్రికలో వచ్చిన ప్రకటన ఆలోచింపజేసింది. ‘కృత్రిమ గర్భదారణ కోసం మహిళ’ కావాలి అన్న ప్ర కటనలోని నెంబరుకు ఫోన్‌ చేసి మాట్లాడింది. ఆ జంటను కలిసి అన్ని వివరాలను తెలుసుకుంది. వారు ఆమెను ఢిల్లీలోని ఓ ఆసుప్రతికి తీసుకెళ్ళారు.

అక్కడి డాక్టర్లు వివరించిన ప్రకారం ఆమె అన్నీ తెలుసుకుని అందుకు సరేనంది. ఆ జంట నీలంను తమ దగ్గరలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్ళేం దుకు సిద్ధమయ్యారు. చుట్టు పక్కల వారికి దీనికి సంబంధించిన వివ రాలు తెలిస్తే ఎక్కడ తనను గెంటేస్తారో అన్న భయంతో తనకు ఒక చోట ఉద్యోగం దొరికిందని, సంవత్సరం పాటు అక్కడే వుండాలని చెప్పి వారితో వెళ్ళిపోయింది. మొదటిసారి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కనీసం చూడ నైనా చూడకుండానే ఆమె వారికి అప్పగించేసింది. ఇందుకు నీలంకు వచ్చిన మొత్తం రూ.85వేలు.
వచ్చిన మొత్తంతో అప్పులు తీర్చుకుని కాస్త కుదుట పడిన నీలం.. నోయి డాలోని ఓ ఆసుప్రతిలో ఉద్యోగానికి చేరింది.

ఓ ఇంటికి యజమానురాలు..
mamyఇప్పుడు నీలంకు దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలుసు. దీంతో 2007లో మరోసారి కృత్రిమ గర్భధారణకు సిద్ధమైంది. ఇందుకు ఆమెకు 2లక్షల రూపాయలు ఇచ్చేలా ఒప్పందం చేసుకుంది. ముందుగానే వారి తో ‘నేను కేవలం తొమ్మిది నెలలు మాత్రమే నా కడుపులో బిడ్డను మోస్తా ను. పుట్టిన తరువాత నాకూ ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం వుండదు. ఇతర ఏ విషయాలు కూడా నాకు వద్దు’ అని చెప్పింది. వినేందుకు ఇది ఎంతో కఠినంగా వున్నా.. ఆమె తన బిడ్డల కోసం చేస్తున్న ఈ పనిని కేవ లం సైన్స్‌ పరంగానే తీసుకుంది. నీలం ఆడ పిల్లకు జన్మనిచ్చింది. ఎంతో సంతోషపడిన ఆ జంట రూ.7.5 లక్షలు నీలంకు ఇచ్చారు. ఆ మొత్తంతో నీలం వెంటనే ఓ సొంత ఇంటిని కొనుగోలు చేసింది. ఎంతో ఆనందంగా తన బిడ్డలను ఓ సొంత ఇంటిని ఇచ్చానన్న సంతృప్తిని వ్యక్తం చేసింది.

ఇక మూడోసారి పరిస్థితి మాత్రం భిన్నం. నీలం ఓ ఒంటరి ఇజ్రాయెల్‌ తండ్రికి బిడ్డను కని ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. బిడ్డ పుట్టిన తరు వాత ఓ రోజు మొత్తం ఆ పాపతోనే గడిపింది. ‘అతనికి చూసుకోవడం తెలియలేదు. వారు వెళ్ళేవరకు ఒక రోజు మొత్తం ఆ బిడ్డతో గడపాల్సి వచ్చింది. ఆ పాపతో ఫొటోలు కూడా తీసుకున్నాను’ అని చెబుతోంది. దీనికి ఆమె 3.5 లక్షల రూపాయలను తీసుకుంది.

వారంతా నా సొంతం కాదు..
‘వాళ్ళు నా పిల్లలు కాదు.. గుర్తు రావడానికి... వారి తల్లిదండ్రులు వేరు. నేను కేవలం వారికి జన్మనిచ్చాను అంతే.. ఎప్పుడైనా వారి పుట్టిన రోజు నాడు ఒక మెసేజ్‌ చేస్తాను. ఓసారి గుర్తు చేసుకుంటాను. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే ఇది నా కన్న బిడ్డల కోసమే చేశాను.. కానీ మరొ కరి మీద ప్రేమతో మాత్రం కాదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమి టంటే ఈ విషయం నా చుట్టు పక్కల వారికి ఎవరికీ తెలియదు. కానీ ఇద్ద రు బిడ్డలకు తెలుసు. వారి కోసమే దీన్ని చేసినప్పుడు వారికి చెప్పకుంటే ఎలా చెప్పండి? అందుకే చెప్పాను. వారి నుండి నాకు పూర్తి సహకారం వుంటుంది. వారి భవిష్యత్తులో ఈ డబ్బు ఎంతో వుపయోగపడుతుంది’ అని అంటోంది.

‘భారతదేశంలో ప్రతి సంవత్సం ఈ తరహా గర్భధారణ ద్వారా రెండు వేల కోట్ల వ్యాపారం జరుగుతోంది’
‘ఈ పద్ధతిలో నాకు పుట్టిన మొదటి బిడ్డ అబ్బాయి. కానీ నేను చూడనేలేదు’
-హైమ సింగతల
surya telugu daily, January 29, 2011

No comments:

Post a Comment